IIITN Recruitment 2022: బీఈ/బీటెక్ నిరుద్యోగులకు మరో అవకాశం! రూ.1,77,500ల జీతంతో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పోస్టులు..
కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన మహారాష్ట్ర రాష్ట్రం నాగ్‌పుర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IIIT Nagpur).. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన 7 టెక్నికల్ ఆఫీసర్, ల్యాబొరేటరీ అసిస్టెంట్ తదితర..
IIIT Nagpur Technical Officer Recruitment 2022: కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన మహారాష్ట్ర రాష్ట్రం నాగ్‌పుర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IIIT Nagpur).. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన 7 టెక్నికల్ ఆఫీసర్, ల్యాబొరేటరీ అసిస్టెంట్(కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్), ల్యాబొరేటరీ అసిస్టెంట్(ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్), జూనియర్ అసిస్టెంట్ (మల్టీ-స్కిల్డ్)- అడ్మినిస్ట్రేషన్, జూనియర్ అసిస్టెంట్ (మల్టీ-స్కిల్డ్)- అకౌంట్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీ/బీఈ/బీటెక్/ఎంఎస్సీ/ఎంసీఏ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు 45 ఏళ్లు, ఇతర పోస్టులకు 27 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో అక్టోబర్ 12, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. అనంతరం హార్డు కాపీలను డౌన్‌లోడ్ చేసుకుని కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా అక్టోబర్ 19వ తేదీలోపు పంపించవల్సి ఉంటుంది. రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ప్రతిభకనబరచిన వారికి నెలకు రూ.21,700ల నుంచి రూ.1,77,500ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అడ్రస్: The Director, Indian Institute of Information Technology, Nagpur S.No. 140,141/1 Behind Br. Sheshrao Wankhade Shetkari Sahkari Soot Girni, Village – Waranga, PO – Dongargaon (Butibori), District – Nagpur, Maharashtra – Pin Code – 441108.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.