AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IGNOU admission 2022: ఇగ్నో జనవరి సెషన్‌ 2022 ప్రవేశాల గడువు పెంపు.. ఎప్పటివరకంటే..

ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU) ఓపెన్ అండ్ డిస్టెన్స్ మోడ్ (ODL)లో 2022 విద్యాసంవత్సరానికిగాను (జనవరి సెషన్‌) ప్రవేశాల నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీని..

IGNOU admission 2022: ఇగ్నో జనవరి సెషన్‌ 2022 ప్రవేశాల గడువు పెంపు.. ఎప్పటివరకంటే..
Ignou 2022
Srilakshmi C
|

Updated on: Mar 07, 2022 | 6:37 AM

Share

IGNOU Admission 2022 deadline extended: ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU) ఓపెన్ అండ్ డిస్టెన్స్ మోడ్ (ODL)లో 2022 విద్యాసంవత్సరానికిగాను (జనవరి సెషన్‌) ప్రవేశాల నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీని తాజాగా మార్చి 15 వరకు పొడిగించింది. ఇప్పటివరకు ఇంకా దరఖాస్తు చేసుకోని విద్యార్థులు ఎవరైనా ఉంటే అధికారిక వెబ్‌సైట్‌ (ignouadmission.samarth.edu.in)లో ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీని పొడిగిస్తున్నట్టు ఇగ్నో తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. ఇగ్నో జనవరి 2022 సెషన్‌కు తాజా అడ్మిషన్లు, రీ-రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం మార్చి 15 వరకు పొడిగిస్తున్నట్టు పేర్కొంది. దరఖాస్తు ప్రక్రియ, ప్రవేశాలు.. ఇతర ఏవైనా సందేహాలుంటే అభ్యర్థులు ఈ మెయిల్ ssc@ignou.ac.in లేదా ఫోన్‌ 011-29572513 లేదా 29572514 నెంబర్ల ద్వారా సందేహాలనివృతి చేసుకోవచ్చని తెల్పింది.

అసక్తి కలిగిన విద్యార్ధులు దరఖాస్తు చేసుకునే సమయంలో న్యూ రిజిస్ట్రేషన్‌ను క్రియేట్‌ చేసుకుని, అవసరమైన అన్ని వివరాలను సమర్పించాలి. అలాగే ఏ కోర్సులో అడ్మిషన్‌ తీసుకోవాలనుకుంటున్నారో ఆ కేటగిరీని కూడా ఎంచుకోవాలి. చివరిగా ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ను సబ్‌మిట్‌ చేసేముందుగా ఇచ్చిన సూచనలన్నింటినీ తరవుగా చదువుకుని సబ్‌మిట్‌ చేయవల్సి ఉంటుంది. కాగా ఇగ్నో వృత్తి విద్య, శిక్షణను ఉన్నత విద్యతో అనుసంధానం చేసేందుకు యూనివర్సిటీ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్‌ ఎంట్రప్రెన్యూర్‌షిప్ (MSDE) మంత్రిత్వ శాఖతో 2022 జనవరి 18న ఒప్పందం కుదుర్చుకుంది. దేశ యువతకు ఉద్యోగ లేదా పని అవకాశాలను సృష్టించడం, వొకేషనల్‌ అండ్‌ టెక్నికల్‌ ట్రైనింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌ను బలోపేతం చేయడమే ఈ ఒప్పందం ముఖ్య ఉద్ధేశ్యం. అధికారిక సమాచారం ప్రకారం.. దాదాపు 32 నేషనల్‌ స్కిల్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్లు(NSTI), 3000 ITIలు, 500 ప్రధాన మంత్రి కౌశల్‌ కేంద్ర (PMKK), 300 JSSలు రిజిస్ట్రేషన్, పరీక్ష, పని కేంద్రాలుగా వర్సిటీతో అనుబంధించబడతాయి.

Also Read:

Project Engineer Jobs 2022: బీటెక్‌ చేసి ఖాళీగా ఉన్నారా? మెరిట్‌ ఆధారంగా బెల్‌లో 55 వేల జీతంతో ఉద్యోగాలు.. వెంటనే దరఖాస్తు..