OIL India Jobs 2022: నెలకు రూ. 2 లక్షలకుపైగా జీతంతో.. ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో 55 గ్రేడ్ సి, బి ఉద్యోగాలు..
భారత ప్రభుత్వ రంగానికి చెందిన నవరత్న సంస్థ అయిన ఆయిల్ ఇండియా లిమిటెడ్ (Oil India Limited) గ్రేడ్ సి, బి పోస్టుల (Grade B, C Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి
OIL India Grade B, C Recruitment 2022: భారత ప్రభుత్వ రంగానికి చెందిన నవరత్న సంస్థ అయిన ఆయిల్ ఇండియా లిమిటెడ్ (Oil India Limited) గ్రేడ్ సి, బి పోస్టుల (Grade B, C Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 55
- గ్రేడ్ B పోస్టులు: 50
- గ్రేడ్ C పోస్టులు: 5
ఖాళీల వివరాలు: గ్రేడ్ – B, C పోస్టులు
వయో పరిమితి: అభ్యర్ధుల వయసు ఫిబ్రవరి 25, 2022 నాటికి 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ. 80,000ల నుంచి రూ.2,20,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత కోర్సుల్లో కనీసం 65 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ/పీజీ/ఎమ్‌డీ/డీఎన్‌బీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష (CBT), గ్రూప్ డిస్కషన్ (GD)/గ్రూప్ టాస్క్ (GT), పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం: మొత్తం 100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు 2 గంటల్లో సమాధానాలు రాయవల్సి ఉంటుంది. నెగెటివ్ మార్కులు లేవు.
దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 15, 2022.
దరఖాస్తు రుసుము: జనరల్/ఓబీసీ అభ్యర్ధులకు: రూ.500 ఎస్సీ/ఎస్టీ/ఎక్స్ సర్వీస్‌మెన్‌లకు దరఖాస్తు రుసుము నుంచి మినహాయింపు వర్తిస్తుంది.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: