ICAR IARI 2022 Exam Dates: నిరుద్యోగులకు గమనిక.. ఐకార్ 641టెక్నీషియన్ రాత పరీక్ష తేదీ విడుదల.. ఎప్పటినుంచంటే..
ఐకార్-ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (IARI) టెక్నీషియన్(T1) పోస్టుల భర్తీకి నిర్వహించనున్న రాత పరీక్ష తేదీలను ప్రకటించింది..
ICAR IARI Technician Recruitment 2022: ఐకార్-ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (IARI) టెక్నీషియన్(T1) పోస్టుల భర్తీకి నిర్వహించనున్న రాత పరీక్ష తేదీలను ప్రకటించింది. తాజా ప్రకటన ప్రకారం ఐకార్-టెక్నీషియన్ పరీక్షలు ఫిబ్రవరి 28, మార్చి 2, 4 , 5 తేదీల్లో నిర్వహించబడుతుంది. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ iari.res.in లో పూర్తి షెడ్యూల్‌ను చెక్ చేసుకోవాలని ఐకార్ సూచించింది. ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను ఐకార్ త్వరలో విడుదల చేస్తుంది. ఇక ఈ పరీక్షలను ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నారనరే విషయం తెలిసిందే. మొత్తం 641 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి ఈ పరీక్షలు జరగనున్నాయి. ఇతర ముఖ్య అప్‌డేట్ల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని అభ్యర్ధులకు సూచించింది.
IARI-ICAR పరీక్ష తేదీలు 2022 ఎలా చెక్ చేయాలంటే..
- ముందుగా IARI అధికారిక వెబ్‌సైట్ iari.res.inను ఓపెన్ చెయ్యాలి.
- హోమ్‌పేజీలో కనిపించే Online Examination for the post of Technician(T-1) (Final Exam Date) లింక్‌పై క్లిక్ చెయ్యాలి.
- తర్వాత పీడీఎఫ్ పేజ్ ఓపెన్ అవుతుంది. పరీక్షకు సంబంధించిన తేదీల వివరాలు దీనిలో ఉంటాయి.
- పీడీఎఫ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింట్‌అవుట్ తీసుకోవాలి.
నోటిఫికేషన్‌కు సంబంధించి ఇతర వివరాలు..
మొత్తం పోస్టులు: 641 వీటిలో అన్‌రిజర్వ్‌డ్ (286), ఓబీసీ (133), ఈడబ్ల్యూఎస్ (61), ఎస్సీ (93), ఎస్టీ (68) పోస్టులు ఉన్నాయి.
టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు.. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.21,700(బేసిక్)+అలవెన్సులు అందిస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు జనవరి 10,2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
దరఖాస్తు రుసుము: ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి, జనరల్, EWS, OBC అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ. 1000 డిపాజిట్ చేయాలి. ఇది కాకుండా SC, ST కేటగిరీకి చెందిన అభ్యర్థులు 300 రూపాయల దరఖాస్తు రుసుమును చెల్లించాలి. దీన్ని డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్‌లైన్ మోడ్‌లో చెల్లించవచ్చు.
Also Read: