Job Fair: నిరుద్యోగులకు బంపరాఫర్.. నేడు, రేపు హైదరాబాద్ జేఎన్‌టీయూలో జాబ్ మేళా.. 10 వేలకుపైగా ఉద్యోగాలు..
Job Fair: కరోనా మహమ్మారి సమయంలో ఉద్యోగాల నియామకంలో కాస్త వేగం తగ్గిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కంపెనీలు భారీ ఎత్తున ఉద్యోగులను నియామకం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే..
Job Fair: కరోనా మహమ్మారి సమయంలో ఉద్యోగాల నియామకంలో కాస్త వేగం తగ్గిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కంపెనీలు భారీ ఎత్తున ఉద్యోగులను నియామకం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే వరుస జాబ్ మేళాలను నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా తాజాగా హైదరాబాద్‌లో భారీ జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు. జేఎన్‌టీయూ, నిపుణ ఫౌండేషన్, సేవా ఇంటర్నేషనల్ సంయుక్తా ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళాను నిర్వహించనున్నారు. హైదరాబాద్ జేఎన్‌టీయూ క్యాంపస్‌లో ఈ జాబ్ మేళ నేడు, రేపు (డిసెంబర్ 18, 19) నిర్వహించనున్నారు.
ఈ భారీ జాబ్ మేళాలో ఏకంగా 120కు పైగా కంపెనీలు పాల్గొంటుండగా 10 వేలకుపైగా ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ జాబ్‌మేళాను శనివారం తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రారంభించనున్నారు. ఉదయం 8:30 నుంచి సాయంత్రం 6:00 గంటల వరకు ఈ జాబ్‌మేళా జరగనుంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ లింక్ https://nipunahds.com/event-4603445/Registration ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
జాబ్‌మేళాలో భాగంగా ఐటీ, ఐటీఈఎస్, కోర్, మేనేజ్‌మెంట్, ఫార్మా, బ్యాంకింగ్ విభాగాల్లో ఉద్యోగులను తీసుకోనున్నారు. పని అనుభవం ఉన్న వారితో పాటు 2012 నుంచి 2022లో డిగ్రీ పూర్తి చేసిన ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్‌మేళాకు హాజరుకావొచ్చు. జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు.. పదో తరగతి, ఇంటర్, బీటెట్, బీఫార్మసీ, ఎమ్‌టెక్, ఎమ్ ఫార్మతో పాటు ఏదైనా డిగ్రీ జిరాక్స్ సర్టిఫికేట్‌లతో పాటు రెజ్యూమ్ కాపీని వెంట తెచ్చుకోవాలని అధికారులు తెలిపారు.
మంచిర్యాలలో విచిత్ర సంఘటన.. వ్యాక్సిన్ వేయగానే మహిళకు పూనకం.. వీడియో వైరల్..