TS Inter Exams: ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ఇంటర్ బోర్డ్..
TS Inter Exams: తాజాగా విడుదల చేసిన తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం భారీగా తగ్గిన విషయం తెలిసిందే. కరోనా నేపథ్యంలో నేరుగా తరగతులు జరగకపోవడం...

TS Inter Exams: తాజాగా విడుదల చేసిన తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం భారీగా తగ్గిన విషయం తెలిసిందే. కరోనా నేపథ్యంలో నేరుగా తరగతులు జరగకపోవడం, మొదట్లో పరీక్షలను రద్దు చేసి విద్యార్థులను సెకండ్ ఇయర్‌కు ప్రమోట్ చేయడం, మళ్లీ తిరిగి పరీక్షలను నిర్వహించిన నేపథ్యంలో విద్యార్థులు గందరగోళానికి గురయ్యారని, హాజరు శాతం తగ్గడానికి అదే కారణమని కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఇంటర్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల్లో ఫెయిల్ వారికి వచ్చే ఏడాది ఏప్రిల్‌లోనే మరోసారి పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు కార్యదర్శి జలీల్ తెలిపారు.
ఏప్రిల్ వార్షిక పరీక్షల్లో మరోసారి పరీక్ష రాయోచ్చని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఫలితాలపై ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని తెలిపిన జలీల్.. అనుమానం ఉంటే ఫీజు చెల్లించి జవాబు పత్రాలు పొందవచ్చని చెప్పారు. పరీక్షల్లో సిలబస్ 70శాతానికి తగ్గించి, ప్రశ్నల్లో ఛాయిస్ పెంచామని చెప్పుకొచ్చారు. ఇక తాజాగా విడుదలైన ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో జనరల్, ఒకేషనల్ కలిపి 49 శాతం మంది విద్యార్థులు మాత్రమే పాసయ్యారు. దీంతో తాజాగా ఇంటర్ బోర్డ్ తీసుకున్న నిర్ణయం విద్యార్థులకు ఊరటనిచ్చింది. గతేడాదితో పోలిస్తే ఏకంగా 11 శాతం ఉత్తీర్ణత తగ్గడంతో విద్యార్థులు, తల్లిదండ్రల్లో ఆందోళన నెలకొంది. మొత్తం జనరల్, ఒకేషనల్ విద్యార్థులు 5.59 లక్షల మందికి 2.24 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు.
GHMC: గ్రేటర్‌లో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ వార్.. తొలి రోజే తగువుకు రెడీ అవుతున్న వైరీ పక్షాలు..
బ్యాంక్ చెక్ బుక్ కోసం దరఖాస్తు చేసి విసిగి పోయారా.. అయితే ఎస్‌బీఐ ఖాతాదారులైతే ఇలా చేయండి.