AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GHMC: గ్రేటర్‌లో టీఆర్ఎస్ వర్సెస్‌ బీజేపీ వార్‌.. తొలి రోజే తగువుకు రెడీ అవుతున్న వైరీ పక్షాలు..

జీహెచ్‌ఎంసీలో టీఆర్ఎస్ వర్సెస్‌ బీజేపీ కార్పొరేటర్ల మధ్య వార్‌ నడుస్తోంది. ఇద్దరికి సమానమైన బలం ఉండటంతో పరస్పర ఆరోపణలు హీటెక్కిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య పోరుకు శనివారం  జరగనున్న కౌన్సిల్‌ వేదిక అవుతోంది.

GHMC: గ్రేటర్‌లో టీఆర్ఎస్ వర్సెస్‌ బీజేపీ వార్‌.. తొలి రోజే తగువుకు రెడీ అవుతున్న వైరీ పక్షాలు..
Ghmc Bjp
Sanjay Kasula
|

Updated on: Dec 17, 2021 | 9:20 PM

Share

BJP – TRS: జీహెచ్‌ఎంసీలో టీఆర్ఎస్ వర్సెస్‌ బీజేపీ కార్పొరేటర్ల మధ్య వార్‌ నడుస్తోంది. ఇద్దరికి సమానమైన బలం ఉండటంతో పరస్పర ఆరోపణలు హీటెక్కిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య పోరుకు శనివారం జరగనున్న కౌన్సిల్‌ వేదిక అవుతోంది. కోవిడ్‌ తర్వాత మొదటిసారి జరగనున్న జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశం కోసం వ్యూహాలు సిద్ధం చేసుకున్నారు. గ్రేటర్‌లో చాలా సమస్యలు ఉన్నాయి.. కౌన్సిల్‌ సమావేశం నిర్వహించాలని పదే పదే బీజేపీ కార్పొరేటర్లు డిమాండ్‌ చేశారు. మేయర్‌ అపాయింట్‌మెంట్ ఇవ్వరూ..కౌన్సిల్‌ నిర్వహించరంటూ ఇటీవల బీజేపీ కార్పొరేటర్లు మేయర్‌ ఆఫీసులో హంగామా సృష్టించారు. వారిపై కేసులు కూడా నమోదయ్యాయి.

ఈ దాడిని టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు ఖండించారు. ఐతే శనివారం జరిగే కౌన్సిల్‌ మీటింగ్‌లో రెండు పార్టీల కార్పొరేటర్లు కలవబోతున్నారు. దీంతో కౌన్సిల్‌ సమావేశం సజావుగా జరుగుతుందా..? లేక రచ్చ..రచ్చ.. అవుతుందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రెండు పార్టీలు ఎవరి వ్యూహాలతో వాళ్లు కౌన్సిల్‌ సమావేశానికి రాబోతున్నారు. మేయర్‌ ఆఫీస్‌పై దాడికి బీజేపీ కార్పొరేటర్లు క్షమాపణ చెబితేనే సమావేశంలో మాట్లాడించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. మంత్రి తలసాని ఆధ్వర్యంలో టీఆర్ఎస్ కార్పొరేటర్లు సమావేశం నిర్వహించి వ్యూహం రచించారు.

అటు బీజేపీ నేత లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో బీజేపీ కార్పొరేటర్లు మీట్‌ అయ్యి…పక్కా వ్యూహంతో వస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కౌన్సిల్‌ హాల్లో టీఆర్‌ఎస్‌-బీజేపీ-ఎంఐఎం కార్పొరేటర్లకు ప్రత్యేక సీట్లు ఏర్పాటు చేశారు. సమావేశానికి రావడానికి మేయర్‌-ఇతర అధికారులకు ఒక దారి.. కార్పొరేటర్లకు మరో దారిని ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి: మీ ఇంటికి బిర్యానీ ఎవరు తెచ్చారో ఓ సారి చూడండి.. డెలివరీ బాయ్ కాదండోయ్..

Rakesh Jhunjhunwala: 10 సెకెన్లలో రూ. 318 కోట్లు మాయం.. దలాల్ స్ట్రీట్‌లో దగాపడిన బిగ్ బుల్..

శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో పెద్దపులి స్విమ్మింగ్
శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో పెద్దపులి స్విమ్మింగ్
లక్కు కలిసొచ్చిందిరోయ్.. 50 ఏళ్ల తర్వాత అదృష్టపట్టే రాశులివే..
లక్కు కలిసొచ్చిందిరోయ్.. 50 ఏళ్ల తర్వాత అదృష్టపట్టే రాశులివే..
ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో