మంచిర్యాలలో విచిత్ర సంఘటన.. వ్యాక్సిన్‌ వేయగానే మహిళకు పూనకం.. వీడియో వైరల్..

గత రెండేళ్లుగా యావత్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది కరోనా మహామ్మారి. ప్రపంచం మొత్తాన్ని భయంతో వణికిపోయేలా చేసింది

మంచిర్యాలలో విచిత్ర సంఘటన.. వ్యాక్సిన్‌ వేయగానే మహిళకు పూనకం.. వీడియో వైరల్..
Viral
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 17, 2021 | 8:33 PM

గత రెండేళ్లుగా యావత్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది కరోనా మహామ్మారి. ప్రపంచం మొత్తాన్ని భయంతో వణికిపోయేలా చేసింది వైరస్. ఆర్థికంగానే కాకుండా.. తీవ్ర ప్రాణ నష్టం చేసింది. కరోనా మహమ్మారి.. లాక్ డౌన్ కారణంగా వేలాది మంది ప్రజలు రోడ్డు మీద పడ్డారు. ఓవైపు వైరస్ వ్యాప్తి.. మరోవైపు ఆకలి కేకలతో భారతదేశం చిగురుటాకుల వణికిపోయింది. ఫస్ట్ వేవ్.. సెకండ్ వేవ్ రూపంలో ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంది ఈ మహామ్మారి. ఇప్పుడు మరోసారి ఓమిక్రాన్ వేరియంట్ రూపంలో ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తుంది. రోజూ రోజూకీ ఓమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతుండడంతో ప్రభుత్వాలు కట్టడి చర్యలు చేపట్టాయి. కరోనా.. ఓమిక్రాన్ నుంచి రక్షణ కవచం మాత్రం వ్యాక్సినేషన్ ఒక్కటే అంటున్నారు నిపుణులు.

రోజుకో కొత్త రూపంతో విరుచుకు పడుతున్న కరోనాను ఎదుర్కొనేందుకు చేపట్టిన వ్యాక్సినేషన్‌ ప్రక్రియ దేశవ్యాప్తంగా కొనసాగుతూనే ఉంది. వ్యాక్సిన్ పై ఉన్న అపోహలను తొలగిస్తూ.. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేస్తున్నారు. మరో వైపు రాష్ట్రంలోకి ఓమిక్రాన్‌ కేసులు కూడా ఎంటరవడంతో ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. ఇప్పటీకీ టీకా వేసుకోని మారు మూల ప్రాంతాల్లోని ప్రజలు వ్యాక్సినేషన్‌ వేస్తున్నారు ఆరోగ్య సిబ్బంది. ఈ క్రమంలో మంచిర్యాల జిల్లాలో విచిత్ర సంఘటన జరిగింది. వ్యాక్సిన్‌ వేసేందుకు వెళ్లిన ఆరోగ్య సిబ్బందికి అనుకోని సంఘటన ఎదురైంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మంచిర్యాల జిల్లాలో వ్యాక్సిన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో వేమనపల్లి మండలం ముల్కలపేటలో కోవిడ్ వ్యాక్సినేషన్‌ కోసం ఆరోగ్య సిబ్బంది వెళ్లారు. ఈ క్రమంలో రాజక్క అనే మహిళకు వ్యాక్సిన్‌ వేశారు. వెంటనే ఆ మహిళ పూనకం వచ్చినట్టుగా ఊగిపోయింది. దేవుళ్ల పేర్లను పలుకుతూ వింతగా ప్రవర్తించింది. దీంతో ఆశ్చర్యపోయిన ఆరోగ్య సిబ్బంది ఆమెను మామూలు స్థితికి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. వ్యాక్సిన్‌ గురించి వివరిస్తూ అవగాహన కల్పించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.

Also Read: Pushpa Movie Release Live: మొదలైన పుష్ప రాజ్ బాక్సాఫీస్ వేట.. థియేటర్స్ దగ్గర సందడి చేస్తున్న ఫ్యాన్స్..

Manasa Varanasi: మిస్‌ వరల్డ్‌ పోటీల్లో కరోనా కలకలం.. మహమ్మారి బారిన పడిన మిస్‌ ఇండియా.. తాత్కాలికంగా పోటీల వాయిదా..

Bheemla Nayak: వికారాబాద్ అడవుల్లో భీమ్లానాయక్ చిత్ర యూనిట్.. పవన్ కోసం సందడి చేస్తున్న ఫ్యాన్స్

Pushpa: థియేటర్లలో అదరగొడుతున్న ‘పుష్ప’ రాజ్.. బన్నీ సినిమాకి సంబంధించిన 9 అద్భుతాలు ఇవే!

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!