AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Teacher Jobs: ఏపీలో భారీగా ఆంగ్లం, గణితం సబ్జెక్టు టీచర్ల కొరత.. మెగా డీఎస్సీ భర్తీ చేసేనా?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో త్వరలో 16,347 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్‌ వెలువడనున్న సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టులు ఇంతకంటే మరిన్ని ఉన్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఇంగ్లిష్, గణితం సబ్జెక్టుల్లో టీచర్ల కొరత అత్యధికంగా ఉన్నట్లు తాజా గణాంకాలను బట్టి తెలుస్తుంది. ప్రభుత్వ బడుల్లో సబ్జెక్టు టీచర్ల కొరతను తీర్చేందుకు పని సర్దుబాటు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది..

AP Teacher Jobs: ఏపీలో భారీగా ఆంగ్లం, గణితం సబ్జెక్టు టీచర్ల కొరత.. మెగా డీఎస్సీ భర్తీ చేసేనా?
Teachers Shortage In AP
Srilakshmi C
|

Updated on: Jul 29, 2024 | 4:19 PM

Share

అమరావతి, జులై 29: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో త్వరలో 16,347 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్‌ వెలువడనున్న సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టులు ఇంతకంటే మరిన్ని ఉన్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఇంగ్లిష్, గణితం సబ్జెక్టుల్లో టీచర్ల కొరత అత్యధికంగా ఉన్నట్లు తాజా గణాంకాలను బట్టి తెలుస్తుంది. ప్రభుత్వ బడుల్లో సబ్జెక్టు టీచర్ల కొరతను తీర్చేందుకు పని సర్దుబాటు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. కొత్తగా నిర్వహించే మెగా డీఎస్సీలో ఎంపికైనవారు వచ్చేవరకు తాత్కాలికంగా టీచర్లను సర్దుబాటు చేసేందుకు సమాయాత్తమవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 8,773 మంది సబ్జెక్టు టీచర్లు ఉండగా.. మొత్తం 17,190 మంది అవసరం ఉన్నట్లు తేల్చింది. కొన్ని పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్లు అదనంగా ఉండగా.. మరికొన్ని బడుల్లో కొరత తీవ్రంగా ఉంది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో కలిపి 20,469 మంది ఎస్జీటీలు మిగులుగా ఉన్నట్లు పాఠశాల విద్యాశాఖ తేల్చింది. ఇందులో 5,248 మంది టీచర్ల అవసరం ఉంది. ఎస్జీటీలకు పదోన్నతులు కల్పించడం ద్వారా స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల కొరతను తీర్చేందుకు కసరత్తు చేస్తున్నారు.

ఆంగ్ల భాష టీచర్లు 660 మంది అదనంగా ఉండగా.. 4,270 మంది అవసరం ఉంది. అదనంగా ఉన్నవారిని సర్దుబాటు చేసినా కొరత తీవ్రంగా ఉండనుంది. గణిత సబ్జెక్టుకు 905 మంది అదనంగా ఉండగా.. 3,985 మంది అవసరం ఉంది. ఉన్నత పాఠశాలల్లో గణితం టీచర్ల కొరత కారణంగా పైతరగతులకు ప్రాధాన్యం ఇచ్చి, కిందిస్థాయి తరగతుల బోధనను నిర్లక్ష్యం చేస్తున్నారు. గణితం టీచర్ల కొరత కారణంగా కొన్ని బడుల్లో దిగువ తరగతులకు గణితం టీచర్లతో కాకుండా ఇతర సబ్జెక్టు టీచర్లతో బోధిస్తున్నారు. ఆంగ్ల భాష సబ్జెక్టు విషయంలోనూ ఇదే జరుగుతుంది. తెలుగు భాష టీచర్ల సంఖ్య ఎక్కువగా ఉండగా.. హిందీకి కొంత కొరత ఉంది. భౌతికశాస్త్రం సబ్జెక్టుకు అదనంగా ఉన్న వారిని సర్దుబాటు చేస్తే పరిస్థితి కాస్త మెరుగుపడుతుంది. జీవశాస్త్రం టీచర్లు 1,127మంది అదనంగా ఉండగా.. 2,282 మంది అవసరం ఉన్నట్లు టీచర్లు గుర్తించారు. ఈ ఖాళీలన్నీ మెగా డీఎస్సీతో భర్తీ అవుతాయో.. లేదంటే ఖాళీలు అలాగే ఉండిపోతాయో తెలియాల్సి ఉంది.

జులై 31న తెలంగాణ డీఏవో ప్రాథమిక ‘కీ’ విడుదల

తెలంగాణ రాష్ట్రంలో డివిజనల్‌ అకౌంట్స్‌ అధికారుల(డీఏవో) పోస్టుల భర్తీకి సంబంధించి జూన్‌ 30 నుంచి జులై 4వ తేదీ వరకు ఆన్‌లైన్‌ (సీబీఆర్‌టీ) రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష ప్రాథమిక ‘కీ’ జులై 31న విడుదల చేయనున్నారు. ఈ మేరకు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్‌ నికోలస్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ‘కీ’తోపాటు అభ్యర్థుల సమాధానాల పత్రాలను కూడా వెబ్‌సైట్లో పొందుపరచనున్నారు. ప్రాథమిక ‘కీ’పై ఆగస్టు 1 నుంచి 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.