HPCL Jobs : ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లకు బంపరాఫర్‌! హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌లో ఉద్యోగాలు..

భారత ప్రభుత్వరంగానికి చెందిన మహారత్న సంస్థ అయిన ముంబాయి ప్రధానకేంద్రంగా ఉన్న హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌ (HPCL) పలు పోస్టుల (Various Posts) భర్తీకి..

HPCL Jobs : ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లకు బంపరాఫర్‌! హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌లో ఉద్యోగాలు..
Follow us

|

Updated on: Mar 09, 2022 | 8:29 AM

HPCL Manager, Sr Officer Recruitment 2022: భారత ప్రభుత్వరంగానికి చెందిన మహారత్న సంస్థ అయిన ముంబాయి ప్రధానకేంద్రంగా ఉన్న హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌ (HPCL) పలు పోస్టుల (Various Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం పోస్టుల సంఖ్య: 25

పోస్టుల వివరాలు:

  • చీఫ్‌ మేనేజర్‌/డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌: 5

విభాగాలు: ఇంజిన్‌, కొర్రోఇయన్‌ రీసెర్చ్‌, క్యూడ్ అండ్‌ ఫ్యూయల్స్‌ రీసెర్చ్‌, అనలిటికల్.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 45 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంఈ/ఎంటెక్‌/పీహెచ్‌డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

  • అసిస్టెంట్ మేనేజర్‌/మేనేజర్‌: 8

విభాగాలు: ఇంజిన్‌, పెట్రోకెమికల్స్‌ అండ్‌ పాలిమర్స్‌, నావల్‌ సపరేషన్స్‌, కెటలిస్ట్‌ స్కేలప్‌.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 33 నుంచి 36 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంఈ/ఎంటెక్‌/పీహెచ్‌డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

  • సీనియర్‌ ఆఫీసర్లు: 12

విభాగాలు: ఇంజిన్‌, బ్యాటరీ రీసెర్చ్‌, నావల్‌ సపరేషన్స్‌, క్రూడ్‌ అండ్‌ ఫ్యూయల్స్ రీసెర్చ్‌ తదితర విభాగాలు.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 27 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంఈ/ఎంటెక్‌/పీహెచ్‌డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్దులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తు రుసుము: జనరల్ అభ్యర్ధులకు: రూ.1180 ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 18, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

CCRUM Recruitment 2022: ఇంటర్వ్యూ ద్వారానే.. సెంట్రల్‌ కౌన్సిల్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఇన్‌ యునాని మెడిసిన్‌లో ఉద్యోగాలు..