EPFO Recruitment : పీఎఫ్ ఆఫీసర్ల పోస్టులకు అప్లయ్ చేశారా? నేటితో ముగుస్తున్న గడువు.. అర్హత వివరాల కోసం ఓ లుక్కేయ్యండి..

ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల రిక్రూట్‌మెంట్ కమిషన్ అయిన యూపీఎస్సీ ఈపీఎఫ్ఓ పోస్టుల రిక్రూట్‌మెంట్‌కు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హతలు, వయస్సు, చదువు సంబంధిత విషయాలను వెల్లడించింది.

EPFO Recruitment : పీఎఫ్ ఆఫీసర్ల పోస్టులకు అప్లయ్ చేశారా? నేటితో ముగుస్తున్న గడువు.. అర్హత వివరాల కోసం ఓ లుక్కేయ్యండి..
UPSC EPFO Recruitment 2023
Follow us
Srinu

|

Updated on: Mar 17, 2023 | 3:45 PM

ప్రభుత్వ ఉద్యోగం అంటేనే అందరికీ ఓ క్రేజ్. ముఖ్యంగా ఉద్యోగం వస్తే లైఫ్ సెటిల్ అయ్యిపోతుందని చాలా మంది ఏళ్ల తరబడి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతూ ఉంటారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఓ ఉద్యోగాల రిక్రూట్‌మెంట్‌కు నోటిఫికేషన్ల ఇస్తుండడంతో అంతా అప్లయ్ చేసుకుని సీరియస్‌గా ప్రిపేర్ అవుతున్నారు. అయితే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల రిక్రూట్‌మెంట్ కమిషన్ అయిన యూపీఎస్సీ ఈపీఎఫ్ఓ పోస్టుల రిక్రూట్‌మెంట్‌కు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హతలు, వయస్సు, చదువు సంబంధిత విషయాలను వెల్లడించింది. ముఖ్యంగా ఈ పోస్టుకు అప్లై చేసుకోవడానికి యూపీఎస్సీ నూతనంగా ప్రవేశపెట్టిన ఓటీఆర్ విధానంలో అప్లయ్ చేసుకోవాలని పేర్కొంది. ఈ పోస్టులకు అప్లయ్ చేసుకోవడానికి ఈ రోజు 17/03/2023తో గడువు ముగియనుంది. 

ఓటీర్ రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

577 ఖాళీలకు నోటిఫికేషన్..

ఈ స్పెషల్ రిక్రూట్ డ్రైవ్‌లో 577 అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్/అకౌంట్స్ ఆఫీసర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ముందుగా ఫారమ్‌లను సమర్పించాలని, చివరి నిమిషంలో రద్దీని నివారించడానికి గడువు వరకు వేచి ఉండవద్దని కమిషన్ గతంలో కోరింది. ప్రకటించిన మొత్తం ఖాళీలలో 418 ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్/అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు, 159 అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ పోస్టుకు ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థుల ఎంపికను యూపీఎస్సీ పేపర్ టెస్ట్, ఇంటర్వ్యూల ద్వారా చేస్తారు. రెండు పోస్టులకు యూపీఎస్సీ వేర్వేరు పరీక్షలను నిర్వహిస్తుంది. అలాగే పరీక్ష తేదీలు కమిషన్ వెబ్‌సైట్‌లో త్వరలో ప్రకటిస్తారు. పరీక్ష నోటిఫికేషన్‌లో సిలబస్ ఇతర వివరాలను తెలిపారు. అర్హత, వయోపరిమితి సంబంధిత వివరాలను తనిఖీ చేయడానికి, అభ్యర్థులు UPSC వెబ్‌సైట్‌లో వివరణాత్మక నోటీసును తనిఖీ చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..