IISER Recruitment: డిగ్రీ పాస్‌ అయితే చాలు.. కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం పొందే ఛాన్స్‌. ఎలా ఎంపిక చేస్తారంటే..

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఐసర్) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు...

IISER Recruitment: డిగ్రీ పాస్‌ అయితే చాలు.. కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం పొందే ఛాన్స్‌. ఎలా ఎంపిక చేస్తారంటే..
Iiser Recruitment
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 17, 2023 | 10:37 AM

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఐసర్) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 27 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో ప్రిన్సిపల్ టెక్నికల్ ఆఫీసర్, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్, టెక్నికల్ ఆఫీసర్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, నర్స్, జూనియర్ లైబ్రరీ సూపరింటెండెంట్ ఆఫీస్ అసిస్ట్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ వంటి పోస్టులు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టుల ఆధారంగా సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీ /బీఎస్సీ (నర్సింగ్)/బీఈ/బీటెక్/ఎంటెక్/ఎంసీఏ/ఎంఎస్సీ/మాస్టర్స్ డిగ్రీ/ఎంఎస్ డిగ్రీ అర్హత సాధించి ఉండాలి.

* వీటితో పాటు సంబంధిత విభాగంలో 4 నుంచి 5 ఏళ్ల పని అనుభవం ఉండాలి.

* అభ్యర్థుల వయసు వయసు 33 నుంచి 56 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రాత పరీక్ష/స్కిల్ టెస్ట్/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు ఏప్రిల్‌ 4, 2023ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..