BEL Jobs: బీటెక్ చేసిన వారికి రూ. 55 వేల జీతంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. నేడే చివరి తేదీ.
ప్రముఖ కేంద్ర ప్రభుత్వ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. బెంగళూరులో ఉన్న ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అయితే ఎంపికైన అభ్యర్థులు...
ప్రముఖ కేంద్ర ప్రభుత్వ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. బెంగళూరులో ఉన్న ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అయితే ఎంపికైన అభ్యర్థులు విశాఖపట్నం, న్యూదిల్లీ, ఘజియాబాద్, బెంగళూరులో పని చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు స్వీకరణకు నేటితో (శుక్రవారం)తో గడువు ముగియనున్న నేపథ్యంలో ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 110 ప్రాజెక్ట్ ఇంజనీర్ -1 పోస్టులను భర్తీ చేయనున్నారు.
* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీఈ, బీటెక్/ ఇంజినీరింగ్ బీఎస్సీ(ఎలక్ట్రానిక్స్/ టెలికమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రికల్/ కమ్యూనికేషన్/ మెకానికల్/కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్/ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్/ ఇన్ఫర్మేషన్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
* అభ్యర్థుల వయసు 01-02-2023 నాటికి 32 ఏళ్లు మించకూడదు.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఎంపికైన వారు విశాఖపట్నం, న్యూఢిల్లీ, ఫజియాబాద్, బెంగళూరులో పని చేయాల్సి ఉంటుంది.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 40, 000 నుంచి రూ. 55,000 వరకు చెల్లిస్తారు.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు 17-03-2023ని చివరి తేదీగా నిర్ణయించారు.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..