FCRI Mulugu Admissions 2022: ములుగు- ఫారెస్ట్ కాలేజ్ అండ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో 2022-23 ప్రవేశాలకు నోటిఫికేషన్‌..పూర్తి వివరాలివే..

తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా ములుగులోని ఫారెస్ట్ కాలేజ్ అండ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్.. 2022-23 విద్యాసంవత్సరానికి గానూ రెండేళ్ల ఎంఎస్సీ ఫారెస్ట్రీ కోర్సులో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు..

FCRI Mulugu Admissions 2022: ములుగు- ఫారెస్ట్ కాలేజ్ అండ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో 2022-23 ప్రవేశాలకు నోటిఫికేషన్‌..పూర్తి వివరాలివే..
FCRI Mulugu Admissions 2022-23
Follow us

|

Updated on: Nov 18, 2022 | 9:48 AM

తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా ములుగులోని ఫారెస్ట్ కాలేజ్ అండ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్.. 2022-23 విద్యాసంవత్సరానికి గానూ రెండేళ్ల ఎంఎస్సీ ఫారెస్ట్రీ కోర్సులో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

దరఖాస్తు చేసుకునే విద్యార్ధులు తప్పనిసరిగా బీఎస్సీ (ఆనర్స్‌) ఫారెస్ట్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో నవంబర్‌ 25వ తేదీలోపు ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.500ల ఆలస్య రుసుముతో నవంబర్‌ 28వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.2000లు, ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌ అభ్యర్ధులు రూ.1000లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఏసీఏఆర్‌ఏఐఈఈఏ పీజీ 2022 ప్రవేశ పరీక్షలో సాధించిన స్కోర్‌, బీఎస్సీలో 50 శాతం వెయిటేజీ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. మెరిట్‌ జాబితా నవంబర్‌ 29న విడుదల చేస్తారు. డిసెంబర్‌ 1 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది. డిసెంబర్‌ 5వ తేదీ నుంచి తరగతులు మొదలవుతాయి. పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.