Exim Bank Recruitment: ఎగ్జిమ్ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థుల ఎంపిక..
Exim Bank Recruitment: ఎక్స్‌పోర్ట్–ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎగ్జిమ్ బ్యాంక్) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. పలు విభాగాల్లో ఉన్న మొత్తం 30 ఖాళీలను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ విధానంలో ఈ పోస్టులను తీసుకోనున్నారు...
Exim Bank Recruitment: ఎక్స్‌పోర్ట్–ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎగ్జిమ్ బ్యాంక్) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. పలు విభాగాల్లో ఉన్న మొత్తం 30 ఖాళీలను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ విధానంలో ఈ పోస్టులను తీసుకోనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 30 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో కాంప్లియన్స్ (01), లీగల్ (04), రాజ్‌భాష (02), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (05), హ్యూమన్ రిసోర్స్ (02), రీసెర్చ్ అండ్ అనాలసిస్ (02), లోన్ మానిటరింగ్ (02), ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆడిట్ (01), ఇంటర్నెల్ ఆడిట్ (02), అడ్మినిస్ట్రేషన్ (01), రిస్క్ మేనేజ్‌మెంట్ (02), స్పెషల్ సిట్యూవేషన్ (06) ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా గ్రాడ్యుయేషన్/బీఈ, బీటెక్, ఎంబీఏ/పీజీడీబీఏ, సీఏ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. దీంతో పాటు సంబంధిత పనిలో అనుభవం, టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.
* అభ్యర్థుల వయసు పోస్టుల ఆధారంగా 35 నుంచి 62 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను తొలుత పని అనుభవం ఆధారంగా షార్ట్ లిస్టింగ్ చేస్తారు. అనంతరం పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక చేస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు 28-04-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: IPL 2022: ఆరెంజ్, పర్పుల్ క్యాప్‌ను దక్కించుకున్న రాజస్థాన్
Fancy Numbers: హోండా యాక్టివా ధర రూ.71వేలు.. ఫ్యాన్సీ నంబర్ ఖరీదు రూ.15 లక్షలు!