Fancy Numbers: హోండా యాక్టివా ధర రూ.71వేలు.. ఫ్యాన్సీ నంబర్‌ ఖరీదు రూ.15 లక్షలు!

Fancy Numbers: వాహనం కొనుగోలు చేసిన తర్వాత చాలా మంది ఫ్యాన్సీ నంబర్ల కోసం ఎక్కువ మొత్తంలో ఖర్చు చేస్తుంటారు. ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ల (Fancy Numbers Plates)కు ఉన్న ఆదరణ చెప్పలేనిది. ఫ్యాన్సీ..

Fancy Numbers: హోండా యాక్టివా ధర రూ.71వేలు.. ఫ్యాన్సీ నంబర్‌ ఖరీదు రూ.15 లక్షలు!
Follow us

|

Updated on: Apr 19, 2022 | 5:04 PM

Fancy Numbers: వాహనం కొనుగోలు చేసిన తర్వాత చాలా మంది ఫ్యాన్సీ నంబర్ల కోసం ఎక్కువ మొత్తంలో ఖర్చు చేస్తుంటారు. ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ల (Fancy Numbers Plates)కు ఉన్న ఆదరణ చెప్పలేనిది. ఫ్యాన్సీ నంబర్‌ కోసం చాలా మంది లక్షల రూపాయల వరకు అదనంగా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారు. దేశంలోని అనేక రాష్ట్రాలు ఫ్యాన్సీ నంబర్‌ ప్లేట్‌ల కోసం వేలం కూడా నిర్వహిస్తున్నాయి. అయితే హోండా యాక్టివా (Honda Activa) నెంబర్ ప్లేట్ కోసం ఓ వ్యక్తి ఏకంగా రూ.15 లక్షలు ఖర్చు చేశాడు. వాస్తవానికి ఛండీగఢ్ (Chandigarh) రిజిస్ట్రేషన్, లైసెన్సింగ్ అథారిటీ కొన్ని వాహనాల నంబర్ ప్లేట్ల వేలాన్ని నిర్వహించింది. ఈ వేలంలో అధికార యంత్రాంగానికి రూ.1.5 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ వేలంలో 0001 నంబర్ కూడా ఉంది. ఈ ఫ్యాన్సీ నంబర్‌ను బ్రజ్ మోహన్ అనే వ్యక్తి హోండా యాక్టివా కోసం కొనుగోలు చేశారు. ఈ వేలంలో ఈ నంబర్ ప్లేట్ రూ.15 లక్షలకు అమ్ముడుపోయింది. నివేదికల ప్రకారం.. హోండా యాక్టివా వాస్తవ ధర రూ. 71 లక్షలుగా పేర్కొంది. HD ఆటో నివేదికల ప్రకారం.. ఈ నంబర్‌ ప్లేటు CH01-CJ-0001గా ఉంటుంది.

ఈ విషయమై మోహన్ మాట్లాడుతూ.. హోండా యాక్టీవాను ఈ ఫ్యాన్సీ నెంబర్‌ను వినియోగిస్తాను. త్వరలో కారును కొనుగోలు చేస్తా..ఆ కారుకి కూడా సేమ్‌ ఫ్యాన్సీ నెంబర్‌ను ఉపయోగిస్తానని చెబుతున్నాడు. వేలం సమయంలో మోహన్ ఈ ఫ్యాన్సీ నంబర్ ప్లేట్‌ను కొనుగోలు చేశాడు. వాస్తవానికి, చండీగఢ్ రిజిస్ట్రేషన్, లైసెన్సింగ్ అథారిటీ కొత్త వెహికల్ సిరీస్ CH 01-CG కింద కొన్ని ఫ్యాన్సీ నంబర్ ప్లేట్‌లను వేలం వేసింది. ఈ వేలం ఏప్రిల్ 14 నుండి 16 వరకు కొనసాగింది. ఈ వేలంలో అధికార యంత్రాంగానికి రూ.1.5 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ సమయంలో 378 ప్లేట్లు అమ్ముడయ్యాయి.

విక్రయించిన అన్ని నంబర్ ప్లేట్లలో బ్రజ్ మోహన్ కొనుగోలు చేసిన నంబర్ CH01-CJ-0001 అత్యంత ఖరీదైనది. దీని రిజర్వ్ మొత్తం రూ.50,000గా నిర్ణయించబడింది. అదే సమయంలో రెండవ అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్ CH01-CJ-002. దీనికి రూ. 5.4 లక్షలు చెల్లించారు. అదే సమయంలో, మూడవ స్థానంలో ఉన్న అత్యంత ఖరీదైన ఫ్యాన్సీ ప్లేట్ CH01-CJ-003, దీనికి రూ. 4.2 లక్షలు చెల్లించారు. ఈ నంబర్ ప్లేట్లకు రిజర్వ్ ధర రూ.30,000గా ఉంచారు.

వాస్తవానికి, చండీగఢ్ రిజిస్ట్రేషన్, లైసెన్సింగ్ అథారిటీ కొత్త వెహికల్ సిరీస్ CH 01-CG కింద కొన్ని ఫ్యాన్సీ నంబర్ ప్లేట్‌లను వేలం వేసింది. ఈ వేలం ఏప్రిల్ 14 నుండి 16 వరకు కొనసాగింది. ఈ వేలంలో అధికార యంత్రాంగానికి రూ.1.5 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ సమయంలో 378 ప్లేట్లు అమ్ముడయ్యాయి. విక్రయించిన అన్ని నంబర్ ప్లేట్లలో, బ్రజ్ మోహన్ కొనుగోలు చేసిన నంబర్ CH01-CJ-0001 అత్యంత ఖరీదైనది. దీని రిజర్వ్ మొత్తం రూ.50,000గా నిర్ణయించబడింది. అదే సమయంలో రెండవ అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్ CH01-CJ-002. దీనికి రూ. 5.4 లక్షలు. ఇదే సమయంలో మూడవ స్థానంలో ఉన్న అత్యంత ఖరీదైన ఫ్యాన్సీ ప్లేట్ CH01-CJ-003. దీనికి రూ. 4.2 లక్షలకు ఓ వ్యక్తి దక్కించుకున్నాడు. ఈ నంబర్ ప్లేట్లకు రిజర్వ్ ధర రూ.30,000. ఇక గతంలో 0001 నంబర్ ప్లేట్ కోసం రూ.26.05 లక్షలు చెల్లించారు. ఈ వేలం 2012లో జరిగింది

ఇవి కూడా చదవండి:

EPFO: ఉద్యోగులకు కేంద్రం అదిరిపోయే గుడ్‌న్యూస్‌..? వేతన పరిమితి రూ.21వేలకు పెంపు..!

Mukesh Ambani Birthday: ముఖేష్ అంబానీ బర్త్‌డే స్పెషల్.. ఆయన జీవితంలోని అరుదైన విశేషాలు మీకోసం..