Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు.. పడిపోయిన ఐటీ, బ్యాంకింగ్‌ షేర్లు..

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT), ఫైనాన్షియల్, కన్స్యూమర్ గూడ్స్ స్టాక్‌ల్లో భారీ అమ్మకాల ఒత్తిడితో స్టాక్ మార్కెట్లు(Stock Market) వరుసగా ఐదో సెషన్‌లో భారీ నష్టాల్లో ముగిశాయి...

Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు.. పడిపోయిన ఐటీ, బ్యాంకింగ్‌ షేర్లు..
Stock Market
Follow us

|

Updated on: Apr 19, 2022 | 5:39 PM

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT), ఫైనాన్షియల్, కన్స్యూమర్ గూడ్స్ స్టాక్‌ల్లో భారీ అమ్మకాల ఒత్తిడితో స్టాక్ మార్కెట్లు(Stock Market) వరుసగా ఐదో సెషన్‌లో భారీ నష్టాల్లో ముగిశాయి. మంగళవారం BSE సెన్సెక్స్ 704 పాయింట్లు క్షీణించి 56,463 వద్ద ముగియగా.. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 215 పాయింట్లు తగ్గి 16,959 వద్ద స్థిరపడింది. నిఫ్టీ(Nifty) మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ 1.37 శాతం, స్మాల్ క్యాప్ 1.66 శాతం పడిపోయాయి. నిఫ్టీ ఐటీ 2.98 శాతం, నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ 2.82 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 2.03 శాతం పతనమయ్యాయి. HDFC లిమిటెడ్‌ నిఫ్టీ టాప్‌ లూజర్‌గా నిలిచింది. షేరు 6.26 శాతం పడిపోయి రూ. 2,121.75కి చేరుకుంది. హెచ్‌డిఎఫ్‌సి లైఫ్, ఎస్‌బిఐ లైఫ్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ నష్టాల్లో ముగిశాయి..

30 షేర్ల బీఎస్‌ఈ ఇండెక్స్‌లో హెచ్‌డిఎఫ్‌సి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఇన్ఫోసిస్, ఐటిసి, టెక్ మహీంద్రా, హెచ్‌సిఎల్ టెక్, హిందుస్తాన్ యూనిలీవర్, కోటక్ మహీంద్రా బ్యాంక్, మారుతీ, నెస్లే ఇండియా నష్టాల్లో ముగిశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ, బజాజ్‌ ఫైనాన్స్‌ లాభల్లో ముగిశాయి. కంపెనీల బలహీనమైన త్రైమాసిక ఫలితాలు, రష్యా-ఉక్రెయిన్ వివాదం, అధిక ద్రవ్యోల్బణం మార్కెట్‌పై ప్రభావం చూపింది. గుజరాత్‌ మినరల్ డెవలప్‌మెంట్‌ షేర్లు ఈరోజు ఒకనెల గరిష్ఠానికి చేరాయి. గుజరాత్‌లో లిగ్నైట్‌ బెనిఫికేషన్‌ కేంద్రం ఏర్పాటుకు బిడ్లు ఆహ్వానించిన నేపథ్యంలోనే షేర్లు రాణించాయి. ఇంధన రంగ షేర్లు ఈరోజు భారీగా లాభపడ్డాయి. నిఫ్టీ ఇంధన సూచీ 2 శాతం పెరగ్గా.. బీఎస్‌ఈ ఇంధన సూచీ 3 శాతానికి పైగా ఎగబాకి జీవితకాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. అత్యధికంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 4.5 శాతం మేర లాభపడింది.

Read Also.. Mukesh Ambani: అంబానీ@65.. ఆయన గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు