ESIC PGIMSR Recruitment 2022: ఎటువంటి రాతపరీక్ష లేకుండానే.. ఈఎస్‌ఐఎల్‌లో 95 ఉద్యోగాలకు నోటిఫికేషన్!
భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (ESIC PGIMSR) ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..
Latest ESIC jobs: భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (ESIC PGIMSR) ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
ఖాళీల సంఖ్య: 95
పోస్టులు:
1. సీనియర్ రెసిడెంట్లు
విభాగాలు: హెమటాలజీ, రేడియాలజీ, మెడిసిన్, అనిస్తీషియా, సర్జరీ, పీడియాట్రిక్స్, బయోకెమిస్ట్రీ ఇతర విభాగాల్లోని ఖాళీలను పూరించనున్నారు.
అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ/డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా అనుభవం కూడా ఉండాలి.
2. జీడీఎంఓ: 33
విభాగాలు: మెడిసిన్, సర్జరీ, పీడియాట్రిక్స్, అనిస్తీషియా, సర్జికల్ ఆంకాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, నెఫ్రాలజీ ఇతర విభాగాల్లోని ఖాళీలను పూరించనున్నారు.
అర్హతలు: ఎంబీబీఎస్, సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ/డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా అనుభవం కూడా ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 45 ఏళ్లు మించరాదు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకి హాజర్వాల్సి ఉంటుంది.
అడ్రస్: 5వ అంతరస్తు, డీన్ కార్యాలయం, ఈఎస్ఐ-పీజీఐఎంఎస్ఆర్, సైబరాబాద్, న్యూఢిల్లీ.
దరఖాస్తు రుసుము:
- ఓబీసీ/ఇతర అభ్యర్ధులకు: రూ.300
- ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులకు: రూ.75
ఇంటర్వ్యూ తేదీలు: 2022, ఫిబ్రవరి 16, 17 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: