ESIC Recruitment 2022: మరికొన్ని గంటల్లో ముగియనున్న ఈఎస్‌ఐసీ దరఖాస్తు ప్రక్రియ.. రాత పరీక్షలేకుండానే ఎంపిక..
భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ (ESIC New Delhi).. అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల (Associate Professor Posts) దరఖాస్తు ప్రక్రియ మరి కొన్ని గంటల్లో ముగియనుంది..
ESIC New Delhi Associate Professor Recruitment 2022: భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ (ESIC New Delhi).. అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల (Associate Professor Posts) దరఖాస్తు ప్రక్రియ మరి కొన్ని గంటల్లో ముగియనుంది. టీచింగ్‌పై ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవచ్చు. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం క్లప్తంగా మీకోసం..
వివరాలు:
ఖాళీల సంఖ్య: 115
పోస్టుల వివరాలు: అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు
విభాగాలు: అనస్తీషియా, బయోకెమిస్ట్రీ, బ్లడ్ బ్యాంక్, డెర్మటాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్, ఫోరెన్సిక్ మెడిసిన్, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడక్స్, పీడియాట్రిక్స్, పాథాలజీ, సైకియాట్రీ, రేడియో డయాగ్నసిస్ ఇతర విభాగాల్లో ఖాళీలున్నాయి.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 45 ఏళ్లకు మించరాదు.
పే స్కేల్: నెలకు రూ.15,600ల నుంచి రూ.39,100 + 7600 అలవెన్సలు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ (ఎండీ/ఎంఎస్)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. డెంటల్ అభ్యర్ధులు బ్యాచిలర్ ఆఫ్ డెంటల సర్జరీ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: రీజనల్ డైరెక్టర్, ఈఎస్ఐసీ కార్పొరేషన్, డీడీఏ కాంప్లెక్స్ కమ్ ఆఫీస్, రాజేంద్ర ప్యాలెస్, రాజేంద్రభవన్, న్యూఢిల్లీ 110008.
దరఖాస్తులకు చివరి తేదీ: మే 11, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: