EAPCET 2023: ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ వాయిదా.. కాలేజీ ఫీజులు ఇంకా నిర్దారణ కాకపోవడంతో..
EAPCET 2023: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్ కాలేజీల్లో వసూలు చేసే ఫీజులు ఖరారు కాకపోవడంతో కౌన్సిలింగ్ వాయిదా పడింది. ఇంజనీరింగ్ కాలేజీల్లో ఉన్న సీట్లు, ఫీజుల వివరాలు ఇంకా కొలిక్కి రాలేదు. దీంతో షెడ్యూల్ ఆలస్యం కానుంది. కాలేజీల ఫీజుల ఖరారు విషయంలో ప్రభుత్వానికి, కాలేజీ యాజమాన్యాలకు అవగాహన కుదరలేదు. రాష్ట్రంలో ఇంజినీరింగ్ కళాశాలలకు మూడేళ్లకోసారి ఫీజులను నిర్దారిస్తుంది ప్రభుత్వం. అయితే ఈసారి ఫీజులు పెంపుపై కొన్ని కాలేజీల యాజమాన్యాలు హై కోర్టును ఆశ్రయించాయి. ప్రస్తుతం కోర్టులో దీనిపై విచారణ జరుగుతుంది.

ఆంద్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ వాయిదా పడింది. ఇంజినీరింగ్ కౌన్సిలింగ్‌లో భాగంగా జూలై 24 నుంచి ఆగస్ట్ మూడో తేదీ వరకూ ఆన్ లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించారు. ఆగస్ట్ మూడు నుంచి కళాశాలల ఎంపిక కోసం వెబ్ అప్షన్ల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే వెబ్ అప్షన్లను ఆగస్ట్ 7 వతేదీ నుంచి ఎంపిక చేసుకునేలా వాయిదా వేశారు. అటు ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్లు చేసుకునే అవకాశం ఆగస్ట్ ఆరో తేదీ వరకూ పొడిగించారు. వెబ్ అప్షన్ల ప్రక్రియ వాయిదా పడటంతో సీట్ల కేటాయింపు, కళాశాలల మార్చుకునే తేదీలు కూడా మారనున్నాయి. ఆగస్ట్ 16 నుంచి ప్రారంభం కావలసిన ఇంజినీరింగ్ తరగతులు కూడా వాయిదా పడనున్నట్లు ఆంద్రప్రదేశ్ ఉన్నతవిద్యా మండలి చైర్మన్ హేమచంద్రా రెడ్డి తెలిపారు.
రాష్ట్రంలో ఇంజినీరింగ్ కళాశాలలకు మూడేళ్లకోసారి ఫీజులను నిర్దారిస్తుంది ప్రభుత్వం. అయితే ఈసారి ఫీజులు పెంపుపై కొన్ని కాలేజీల యాజమాన్యాలు హై కోర్టును ఆశ్రయించాయి. ప్రస్తుతం కోర్టులో దీనిపై విచారణ జరుగుతుంది. కనీస ఫీజు 45 వేలు గా నిర్దారిస్తామని విచారణలో భాగంగా కోర్టు తెలిపింది.
కేసు విచారణ పూర్తయితే గానీ ఫీజులపై ఒక స్పష్టత వచ్చే అవకాశం లేదు. కోర్టు సూచన ప్రకారం కొత్త ఫీజులను నిర్ణయించాల్సి ఉంది. ఫీజులు ఫిక్స్ అయితేనే విద్యార్థులు తమకు అనుకూలంగా ఉన్న కాలేజీలు ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో కౌన్సెలింగ్ వాయిదా వేశారు అధికారులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం
