AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DRDO: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో అప్రెంటిస్‌ పోస్టులు.. ఎలా ఎంపిక చేస్తారంటే..

ప్రభుత్వ రంగ సంస్థల్లో అప్రెంటిస్‌ పోస్టులకు ఆసక్తి చూపే వారి సంఖ్య పెద్ద ఎత్తున ఉంటుంది. చదువు పూర్తికాగానే వర్క్‌ ఎక్స్‌పోజర్‌ కోసం చాలా మంది విద్యార్థులు అప్రెంటిస్‌ ఉద్యోగం చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఇందులో భాగంగానే తాజాగా ప్రముఖ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ రక్షణ రంగ సంస్థ డీర్‌డీఓ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది...

DRDO: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో అప్రెంటిస్‌ పోస్టులు.. ఎలా ఎంపిక చేస్తారంటే..
Drdo Jobs
Narender Vaitla
|

Updated on: Sep 28, 2024 | 9:46 AM

Share

ప్రభుత్వ రంగ సంస్థల్లో అప్రెంటిస్‌ పోస్టులకు ఆసక్తి చూపే వారి సంఖ్య పెద్ద ఎత్తున ఉంటుంది. చదువు పూర్తికాగానే వర్క్‌ ఎక్స్‌పోజర్‌ కోసం చాలా మంది విద్యార్థులు అప్రెంటిస్‌ ఉద్యోగం చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఇందులో భాగంగానే తాజాగా ప్రముఖ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ రక్షణ రంగ సంస్థ డీర్‌డీఓ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఐటీఐ అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఇంతకీ ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రముఖ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ డీఆర్‌డీఓ తమ సంస్థలో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఇందులో భాగంగా మొత్తం 200 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. వీటిలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు 40, టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులు 40, ట్రేడ్ అప్రెంటిస్ (ఐటీఐ పాస్) 120 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబ్‌ 24వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు డీర్‌డీఓ అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు.

ఇక అర్హత విషయానికొస్తే.. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు బీఈ/బీటెక్ (ఈసీఈ, ఈఈఈ, సీఎస్ ఈ, మెకానికల్, కెమికల్) పూర్తి చేసి ఉండాలని అధికారులు తెలిపారు. టెక్నీషియన్ అప్రెంటిస్ (డిప్లొమా) పోస్టులకు అప్లై చేసేవారు డిప్లొమా ఇన్ (ఈసీఈ, ఈఈఈ, సీఎస్ ఈ, మెకానికల్, కెమికల్) పూర్తి చేసి ఉండాలి. అదేవిధంగా ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు గాను సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

అభ్యర్థుల వయసు విషయానికొస్తే ఆగస్టు 1, 2024 నాటికి 18 ఏళ్ల లోపు ఉండాలి. 2022, 2023, 2024 సంవత్సరాల్లో గ్రాడ్యుయేట్, డిప్లొమా, ఐటీఐ ట్రేడ్ అప్రెంటీస్) పూర్తి చేసిన రెగ్యులర్ అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్, అకడమిక్ మెరిట్/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థులను ఎంపిక చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఈమెయిల్ ద్వారా సమాచారం అందుతుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్