AP KGBV Teacher jobs: కేజీబీవీ స్కూళ్లలో 604 టీచర్ కొలువులకు నోటిఫికేషన్ విడుదల.. ఎలాంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేదు
ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ ఆధ్వర్యంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయా(KGBV)ల్లో 2024-25 విద్యా సంవత్సరం (ఏడాది) కాలానికి బోధన, బోధనేతర సిబ్బంది ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ కింద అన్ని కేజీబీవీల్లో దాదాపు 604 పోస్టులను భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న బోధనా, బోధనేతర సిబ్బందిని..
ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ ఆధ్వర్యంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయా(KGBV)ల్లో 2024-25 విద్యా సంవత్సరం (ఏడాది) కాలానికి బోధన, బోధనేతర సిబ్బంది ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ కింద అన్ని కేజీబీవీల్లో దాదాపు 604 పోస్టులను భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న బోధనా, బోధనేతర సిబ్బందిని ఒప్పంద, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన నియామకాలు చేపట్టనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. సెప్టెంబర్ 26 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అక్టోబర్ 10, 2024వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అత్యధికంగా శ్రీసత్యసాయి జిల్లా 61 పోస్టులు, అతి తక్కువగా ఏలూరు జిల్లాలో ఒక పోస్టు చొప్పున బోధనా ఖాళీలు ఉన్నాయి. బోధనేతర పోస్టుల్లో అనంతపురం జిల్లాలో అత్యధికంగా 11, బాపట్ల, విశాఖ, ఎన్‌టీఆర్ జిల్లాల్లో అతి తక్కువగా ఒక్కో పోస్టు చొప్పున ఉన్నాయి. ఇంగ్లిష్/ సివిక్స్/ కామర్స్/ మ్యాథ్స్/ ఫిజిక్స్/ కెమిస్ట్రీ/ బోటనీ/ జువాలజీ/ ఒకేషనల్ సబ్జెక్టులో టీజీటీ ఖాళీలు, తెలుగు, హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ సబ్జెక్టుల్లో సీఆర్టీ ఖాళీలు ఉన్నాయి.
ఖాళీల వివరాలు ఇలా..
- ప్రిన్సిపల్ పోస్టులు: 10
- పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT) పోస్టులు: 165
- కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ (CRT) పోస్టులు: 163
- ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (PET) పోస్టులు: 4
- పార్ట్ టైం టీచర్ (PTT) పోస్టులు: 165
- వార్డెన్ పోస్టులు: 53
- అకౌంటెంట్ పోస్టులు: 44
ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, బీఈడీ, యూజీడీపీఈడీ, బీపీఈడీ, ఎంపీఈడీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఓపెన్ కేటగిరి అభ్యర్థులకు 18-42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, మాజీ సైనికులకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వరకు సడలింపు ఉంటుంది. కేవలం మహిళా అభ్యర్ధులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. ఎలాంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఉండదు. అకడమిక్ మార్కులు, సర్వీస్ వెయిటేజీ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు ప్రిన్సిప్‌ల్‌కు రూ.34139, పీజీటీకి రూ.26759, సీఆర్టీకి రూ.26759, పీఈటీకి రూ.26759, అకౌంటెంట్‌కు రూ.18500, వార్డెన్‌కు రూ.18500, పార్ట్ టైమ్ ఇన్‌స్ట్రక్టర్‌కు రూ.18500 చొప్పున జీతంగా చెల్లిస్తారు. ఆసక్తి కలిగిన మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా అక్టోబర్ 10, 2024వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము కింద రూ.250 చెల్లించవల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు..
- ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీలు: అక్టోబర్ 10, 2024.
- మెరిట్ జాబితా వెల్లడి తేదీలు: అక్టోబర్ 14 నుంచి 16 వరకు
- జిల్లా స్థాయి కమిటీ ఆధ్వర్యంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలు: అక్టోబర్ 17 నుంచి 18 వరకు
- తుది మెరిట్ జాబితాపై ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం: అక్టోబర్ 21
- తుది మెరిట్ జాబితా వెల్లడి: అక్టోబర్ 23, 2024.
- నియామక ఉత్తర్వుల జారీ: అక్టోబర్ 23, 2024.
- కాంట్రాక్ట్ అగ్రిమెంట్ తేదీ: అక్టోబర్ 23, 2024.
- డ్యూటీ రిపోర్టింగ్ తేదీ: అక్టోబర్ 24, 2024.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.