Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Career: ఉచిత శిక్షణ, ఉద్యోగ అవకాశం.. నిరుద్యోగులకు సదవకాశం.

అయితే ఈ కోర్సులు డబ్బులతో కూడుకున్న అంశం. కనీసం రూ. 30 వేలు చెల్లిస్తే కానీ నేర్చుకోలేని పరిస్థితి. మరి మంచి ట్యాలెంట్ ఉండి, ఆర్థికంగా ఇబ్బంది పడే వారి పరిస్థితి ఏంటి.? అలాంటి వారి కోసమే డాక్టర్‌ రెడ్డీస్‌ ఆధ్వర్యంలో ఒక మంచి సదవకశాన్ని కల్పిస్తున్నారు. విద్యార్థులకు ఉచితంగా శిక్షణ అందిస్తూ, ఉద్యోగ కల్పనలో సహకరిస్తున్నారు....

Career: ఉచిత శిక్షణ, ఉద్యోగ అవకాశం.. నిరుద్యోగులకు సదవకాశం.
Free Coaching
Narender Vaitla
|

Updated on: Jul 11, 2024 | 2:28 PM

Share

గ్రాడ్యుయేషన్‌ పూర్తికాగానే ప్రతీ ఒక్కరూ చేసే పని ఉద్యోగం కోసం అన్వేషించడం. అయితే ఉద్యోగ అన్వేషణలో భాగంగా చాలా మంది విద్యార్థులు ఏదో ఒక కోర్సు నేర్చుకోవడం సర్వసాధారణం. కంప్యూటర్‌ సంబంధిత కోర్సులతో పాటు ఇతర విద్యను పూర్తి చేసిన వారు కూడా కోర్సులు నేర్చుకుంటేనే ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉంది. కంపెనీల అవసరాలకు అవసరమైన నైపుణ్యాలను నేర్పించేందుకు ఎన్నో సంస్థలు అందుబాటులో ఉన్నాయి.

అయితే ఈ కోర్సులు డబ్బులతో కూడుకున్న అంశం. కనీసం రూ. 30 వేలు చెల్లిస్తే కానీ నేర్చుకోలేని పరిస్థితి. మరి మంచి ట్యాలెంట్ ఉండి, ఆర్థికంగా ఇబ్బంది పడే వారి పరిస్థితి ఏంటి.? అలాంటి వారి కోసమే డాక్టర్‌ రెడ్డీస్‌ ఆధ్వర్యంలో ఒక మంచి సదవకశాన్ని కల్పిస్తున్నారు. విద్యార్థులకు ఉచితంగా శిక్షణ అందిస్తూ, ఉద్యోగ కల్పనలో సహకరిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

డాక్టర్‌ రెడ్డీస్‌ ఆధ్వర్యంలో గ్రో టెక్‌ పేరుతో నైపుణ్య శిక్షణను అందిస్తున్నారు. ఫుల్‌స్టాక్‌ వంటి సాఫ్ట్‌వేర్‌ కోర్సులతో పాటు మరికొన్ని కోర్సులకు సంబంధించి 4 నెలల శిక్షణను పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారు. హైదరాబాద్‌లో ఉచిత ఉపాధి శిక్షణ అందించి, ఉపాధి కల్పిస్తున్నారు. ఐటీఐ, డిప్లొమా, బీటెక్‌, బీఎస్సీ, బీసీఏ వంటి కోర్సులు పూర్తి చేసిన వారు శిక్షణ పొందిన వారు అర్హులు. అర్హులైన వారికి ఒక పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణత సాధించిన వారికి నెలుగు నెలలపాటు సాఫ్ట్‌వేర్‌ కోర్సులతో పాటు సాఫ్ట్‌ స్కిల్స్‌లో శిక్షణ అందిస్తారు. అనంతరం సంబంధిత కంపెనీల్లో ఇంటర్వ్యూలను ఏర్పాటు చేస్తారు. పూర్తి వివరాలు, రిజిస్ట్రేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

వీటితో పాటు గ్రీన్‌ జాబ్స్‌ ప్రోగ్రామ్‌ ద్వారా ఎలక్ట్రిక్‌ వెహికిల్ సర్వీస్‌ కోర్సులో శిక్షణ అందిస్తున్నారు. ఇందులో శిక్షణ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్స్‌ అందిస్తారు. అలాగే సోలార్‌ ప్లాంట్‌ ఇన్‌స్టాలేషన్‌ కోర్సును సైతం అందిస్తున్నారు. డాక్టర్‌ రెడ్డీస్‌ ఫౌండేషన్‌ ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 100 కేంద్రాల ద్వారా ఈ శిక్షణ కార్యక్రమాన్ని అందిస్తున్నారు. మరెందుకు ఆలస్యం మీరు కూడా వెంటనే రిజిస్టర్‌ చేయించుకొని మీ ఉద్యోగ అవకాశానికి మార్గం సుగుమం చేసుకోండి.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

గిల్ సేనకు లార్డ్స్‌లో డేంజర్ బెల్స్
గిల్ సేనకు లార్డ్స్‌లో డేంజర్ బెల్స్
ఇలాంటి వాళ్లు గ్రీన్ టీకి దూరంగా ఉండాల్సిందే!లేదంటే ముప్పు తప్పదు
ఇలాంటి వాళ్లు గ్రీన్ టీకి దూరంగా ఉండాల్సిందే!లేదంటే ముప్పు తప్పదు
అదృష్టం వరించింది​.. గిరిజ‌న కార్మికుడికి దొరికిన ఖ‌రీదైన వ‌జ్రం.
అదృష్టం వరించింది​.. గిరిజ‌న కార్మికుడికి దొరికిన ఖ‌రీదైన వ‌జ్రం.
జొన్న రొట్టె తినడం వలన కలిగే ఐదు అద్భుత ప్రయోజనాలివే!
జొన్న రొట్టె తినడం వలన కలిగే ఐదు అద్భుత ప్రయోజనాలివే!
100 ఏళ్ల తర్వాత అద్భుతం.. అదృష్టకలగనున్న రాశులివే!
100 ఏళ్ల తర్వాత అద్భుతం.. అదృష్టకలగనున్న రాశులివే!
పాలు పొంగిపోవడం మంచిదికాదా.. వాస్తు శాస్త్రం ఏం చెబుతుందంటే?
పాలు పొంగిపోవడం మంచిదికాదా.. వాస్తు శాస్త్రం ఏం చెబుతుందంటే?
Jioలో దిమ్మదిరిగే ప్లాన్‌..రూ.1958 ప్లాన్‌తో 365 రోజుల వ్యాలిడిటీ
Jioలో దిమ్మదిరిగే ప్లాన్‌..రూ.1958 ప్లాన్‌తో 365 రోజుల వ్యాలిడిటీ
ప్రపంచ వింతల వెనక విస్తుపోయే రహస్యాలు.. అపార నిధులన్ని అక్కడే..
ప్రపంచ వింతల వెనక విస్తుపోయే రహస్యాలు.. అపార నిధులన్ని అక్కడే..
ఓ ఇంటి సమీపాన గుప్పుమన్న ఘాటైన వాసన.. అనుమానమొచ్చి చెక్ చేయగా..
ఓ ఇంటి సమీపాన గుప్పుమన్న ఘాటైన వాసన.. అనుమానమొచ్చి చెక్ చేయగా..
రాజస్థాన్‌లో కూలిన ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ జెట్‌.. పైలట్‌ మృతి!
రాజస్థాన్‌లో కూలిన ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ జెట్‌.. పైలట్‌ మృతి!