AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anger: కోపం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు ఇవే.. దాన్ని ఎలా కంట్రోల్ చేయాలంటే?

కోపం అనేది మనుషుల సహజ గుణం. ప్రతి ఒక్కరికీ కోపం వస్తూనే ఉంటుంది. అయితే, కొంతమంది చిన్నచిన్న కారణాలకే అతిగా కోపపడుతుంటారు. ఈ అతి కోపం బంధాలను పాడుచేయడమే కాకుండా, మానసిక, శారీరక ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. కోపం వల్ల శరీరానికి ఏమేమి నష్టాలు జరుగుతాయో ఇక్కడ తెలుగుకుందాం.

Anger: కోపం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు ఇవే.. దాన్ని ఎలా కంట్రోల్ చేయాలంటే?
Effects Of Anger On Health
Anand T
|

Updated on: May 31, 2026 | 8:02 PM

Share

తన కోపమే తనకు శత్రువు.. తన శాంతమే తనకు రక్ష అనే సామేతను మీరు వినే ఉంటారు. అవును ఓ వ్యక్తి కోపమే అతనికి శత్రువుగా మారుతుంది. కాలక్రమేనా అదే అతని వినాశనానికి దారి తీస్తుంది. కోపం అనేది ప్రతి మనిషిలో ఉండే సహజ లక్షణం. కొందరు కోపాన్ని నియంత్రిస్తే.. మరికొందరు మాత్రం ఆ కోపం వల్లే బంధాలను దూరం చేసుకుంటారు. కోపం వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడో అతడే మర్చిపోతాడు. కాబట్టి కోపం వల్ల జరిగే అనార్థాలు. కోపం కారణంగా ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలుసుకుందాం.

కోపం వల్ల శరీరంపై పడే దుష్ప్రభావాలు

గుండెకు హానికరం: ఒక వ్యక్తి అతిగా కోపపడినప్పుడు, అది అతని గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. జర్నల్ ఆఫ్ ది అమెరికన్ హార్ట్ అసోసియేషన్ లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. కోపం, బాధ, ఆందోళన వంటి దినసరి ప్రతికూల భావోద్వేగాలు గుండె సమస్యల ప్రమాదాన్ని పెంచుతాయి. అతి కోపం ఎండోథెలియల్ పనితీరుపై ప్రభావం చూపి, రక్తపోటు పెరగడానికి కారణమవుతుంది.

జీర్ణవ్యవస్థపై ప్రభావం: అతిగా కోపపడటం వల్ల శరీరంలో కార్టిసాల్ హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి. ఇది జీర్ణవ్యవస్థను దెబ్బతీయడం వల్ల మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇది జీర్ణకోశంలో మంటను పెంచుతుంది. మానసిక ఒత్తిడి కారణంగా కడుపు నొప్పి, ఆకలి లేకపోవడం వంటి సమస్యలు తలెత్తి, చివరికి శరీరానికి పోషకాల లోపం ఏర్పడుతుంది.

మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది: కోపం మానసిక ఆరోగ్యాన్ని కూడా పాడుచేస్తుంది. అధ్యయనాల ప్రకారం, కోపం అనేది ఆందోళన , డిప్రెషన్ వంటి మానసిక సమస్యలను పెంచుతుంది. కోపంలో ఉన్నప్పుడు మెదడు ఆలోచించే తార్కిక శక్తిని కోల్పోతుంది, దీనివల్ల సరైన నిర్ణయాలు తీసుకోలేరు. అతి కోపం మీ ఒత్తిడి స్థాయిలను పెంచి, మానసిక అలసట, చిరాకును ఎక్కువ చేస్తుంది.

నిద్ర లేమి, రోగనిరోధక శక్తి క్షీణత: అతి కోపం వల్ల నిద్రలేమి సమస్య ఎదురవుతుంది. కోపంలో ఉన్నప్పుడు మనస్సు మరింత సక్రియంగా, ప్రక్షుబ్ధంగా ఉండటం వల్ల నిద్ర పట్టదు. అలాగే నిరంతర ఒత్తిడి వల్ల శరీరంలో కార్టిసాల్ హార్మోన్ పెరిగి, రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. దీనివల్ల ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం పెరుగుతుంది.

కండరాల నొప్పులు: పదే పదే కోపపడటం వల్ల కండరాల నొప్పులు వస్తాయి. ఈ మానసిక ఒత్తిడి శరీరంపై పడి తలనొప్పి, వెన్నునొప్పి మరియు ఇతర కండరాల సమస్యలకు కారణమవుతుంది.

కోపాన్ని తగ్గించుకోవడం ఎలా?

  • మంచి నీళ్లు తాగండి: మీకు ఎక్కువగా కోపం వచ్చినప్పుడు, ఒక గ్లాసు చల్లటి నీళ్లు తాగండి.
  • దీర్ఘ శ్వాస తీసుకోండి: ఒక క్షణం కళ్ళు మూసుకుని, ప్రశాంతంగా దీర్ఘ శ్వాస తీసుకుంటూ రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నించండి.
  • ధ్యానం, యోగా: మీకు అతి కోపం వచ్చే సమస్య ఉంటే, ప్రతిరోజూ ధ్యానం , యోగా, ప్రయామం సాధన చేయండి.
  • ఆ ప్రదేశం నుంచి వెళ్ళిపోండి: మీకు కోపం తెప్పించే పరిస్థితి ఎదురైనప్పుడు, తక్షణమే ఆ స్థలం నుంచి పక్కకు వెళ్ళిపోవడం మంచిది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us