DOT Recruitment: బీటెక్ చేసిన వారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
DOT Recruitment: డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీ కమ్యూనకేషన్స్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ కమ్యూనికేషన్స్ మంత్రిత్వశాఖకి చెందిన ఈ సంస్థలో కాంట్రాక్ట్ విధానంలో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.?
DOT Recruitment: డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీ కమ్యూనకేషన్స్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ కమ్యూనికేషన్స్ మంత్రిత్వశాఖకి చెందిన ఈ సంస్థలో కాంట్రాక్ట్ విధానంలో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాసుస్తు చేసుకోవాలి.? ఎవరు అర్హులు లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 20 యంగ్ ప్రొఫెషన్సల్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
* వీటితో పాటు సంబందిత పనీలో కనీసం ఏడాది అనుభవం ఉండాలి.
* అభ్యర్థుల వయసు 32 ఏళ్లు మించకూడదు.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్/ ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* మొదట ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్‌ను arvindk.jha29@gov.in మెయిల్ ఐడీకి పంపించాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను వచ్చిన దరఖాస్తుల ఆధారంగా పరీక్ష లేదా, నేరుగా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 60,000 జీతంగా చెల్లిస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు 23-02-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: చలికాలం ఓక్యులర్ మైగ్రేన్‌తో జాగ్రత్త.. వ్యాధి లక్షణాలు, కారణాలు తెలుసుకోండి..?
Crime News: తూర్పుగోదావరి జిల్లాలో దారుణం.. భర్తను హత్య చేసిన భార్య..
India Coronavirus: గుడ్‌న్యూస్.. దేశంలో క్రమంగా తగ్గుతున్న కరోనా కేసులు.. కానీ..