Education: విద్యార్థులకు అలర్ట్.. ఆ దేశంలో చదువుకుంటే డిగ్రీలు చెల్లవు.. యూజీసీ కీలక నిర్ణయం..
Education: విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించిన విద్యార్థులకు యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్, ఆలిండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కీలక ప్రకటన చేసింది. ఉన్నత విద్య కోసం పక్క దేశానికి వెళ్లిన వారు భారత్‌లో ఉద్యోగాలు, వివిధ కోర్సుల్లో అడ్మిషన్లు పొందలేరని..
Education: పాకిస్తాన్‌లో ఉన్నత విద్యనభ్యసించిన విద్యార్థులకు యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్, ఆలిండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కీలక ప్రకటన చేసింది. పాక్‌కు ఉన్నత విద్య కోసం వెళితే భారత్‌లో ఉద్యోగాలు, వివిధ కోర్సుల్లో అడ్మిషన్లు పొందలేరంటూ పత్రిక ప్రకటన విడుదల చేశారు. భారత పౌరులు, ‘ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా’ విద్యార్థులకు ఈ నిబంధనలు వర్తిస్తాయని ప్రకటనలో తలిపారు.
భారత్ వెలుపల విద్యనభ్యసించాలనుకునే విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ఈ మార్గదర్శకాలను జారీ చేసినట్లు యూజీసీ ఛైర్మన్ జగదీశ్ కుమార్ తెలిపారు. భారత ప్రమాణాలకు అనుగుణంగా లేని డిగ్రీ పట్టాలతో ఇబ్బందులు పడొద్దని విద్యార్థులకు సూచించారు. పాకిస్తాన్‌కు చెందిన యూనివర్సిటీల్లో, విద్యాసంస్థల్లో కోర్సులను పూర్తి చేసి వారికి భారత్‌లో ఇతర విద్యా సంస్థల్లో ప్రవేశాలతో పాటు ఉద్యోగాల చేసేందుకు అనుమతివ్వమని తేల్చి చెప్పారు.
అయితే భారతీయ వలస కార్మికులు పాక్‌లో చదువుకుంటే మాత్రం.. పూర్తి స్థాయిలో వెరివికేషన్ చేసిన తర్వాతే అవకాశం కల్పిస్తామని అధికారులు తెలిపారు. వీరు కేంద్ర హోంశాఖ నుంచి ‘సెక్యూరిటీ క్లియరెన్స్ సర్టిఫికెట్’ పొందాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని విద్యాసంస్థల్లోనూ విద్యనభ్యసించడాన్ని నిషేధిస్తూ 2019లో యూజీసీ మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
UGC & AICTE has advised students not to travel to Pakistan for pursuing higher education. pic.twitter.com/L1vl5XmotQ
— ANI (@ANI) April 23, 2022
Also Read: Back Pain: వెన్నునొప్పితో బాధపడుతున్నారా.. ఈ 6 ఇంటి చిట్కాలు పాటిస్తే బెటర్..
KKR vs GT Live Score, IPL 2022: మరో వికెట్ కోల్పోయిన కోల్‌కతా.. ఈసారి ఎవరంటే..
ఆ కుటుంబానికి అండగా ఉంటాం.. ఆ పిల్లల భాద్యత పార్టీదే.. పవన్ కల్యాణ్