Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CTET December 2024: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్‌) డిసెంబర్‌-2024 నోటిఫికేషన్‌ విడుదల

సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) డిసెంబర్‌ 2024 నోటిఫికేషన్‌ విడుదలైంది. సీటెట్​పరీక్షను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్​ఈ) యేటా రెండు సార్లు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో తొలి విడత సీటెట్​పరీక్ష జరగగా, తాజాగా రెండోసారి పరీక్ష నిర్వహణకు సీటెట్‌ సెంబర్‌-2024 నోటిఫికేషన్‌ విడుదలైంది. సీటెట్‌ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ..

CTET December 2024: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్‌) డిసెంబర్‌-2024 నోటిఫికేషన్‌ విడుదల
CTET December 2024
Srilakshmi C
|

Updated on: Sep 18, 2024 | 7:02 AM

Share

సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) డిసెంబర్‌ 2024 నోటిఫికేషన్‌ విడుదలైంది. సీటెట్​పరీక్షను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్​ఈ) యేటా రెండు సార్లు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో తొలి విడత సీటెట్​పరీక్ష జరగగా, తాజాగా రెండోసారి పరీక్ష నిర్వహణకు సీటెట్‌ సెంబర్‌-2024 నోటిఫికేషన్‌ విడుదలైంది. సీటెట్‌ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సెప్టెంబర్‌ 17, 2024వ తేదీ నుంచి ప్రారంభమైంది. అక్టోబర్‌ 16, 2024వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. డిసెంబర్‌ 1న ఈ పరీక్షను ఓఎమ్మార్‌ ఆధారితంగా దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు. కాగా ఉపాధ్యాయ వృత్తిని కెరీర్‌గా ఎంచుకునే వారి కోసం ప్రతీ ఏటా సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) రెండు సార్లు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(సీటెట్‌) డిసెంబర్‌-2024 పరీక్షకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పన్నెండో తరగతి, డిగ్రీతోపాటు డీఈఎల్‌ఈడీ/ డీఈడీ (ప్రత్యేక విద్య), బీఈడీ, బీఈడీ(ప్రత్యేక విద్య), బీఈఎల్‌ఈడీ/ బీఎస్సీఈడీ/ బీఏఈడీ/ బీఎస్సీఈడీ కోర్సులో తప్పనిసరిగా ఉత్తీర్ణులై ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో పేపర్ 1 లేదా 2లకు జనరల్/ ఓబీసీ కేటగిరీలకు రూ.1000 రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద చెల్లించాలి. పేపర్ 1 & 2 రెండూ రాసేవారు రూ.1200 చెల్లించాలి. పేపర్ 1 లేదా 2కు దరఖాస్తు చేసుకునే ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు రూ.500 చెల్లించాలి. పేపర్ 1 & 2 రెండింటికీ దరఖాస్తు చేసుకునే వారు రూ.600 చెల్లించాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్‌ జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.

పరీక్ష విధానం ఎలా ఉంటుందంటే..

సీటెట్ పరీక్ష మొత్తం రెండు పేపర్‌లకు ఉంటుంది. మొదటి పేపర్​ఒకటి నుంచి ఐదు తరగతులకు బోధించాలనుకునే వారికి కోసం, రెండో పేపర్​ఆరు నుంచి తొమ్మిదో తరగతులకు బోధించాలనుకునే వారి కోసం నిర్వహిస్తారు. సీటెట్ స్కోర్‌కు లైఫ్​ లాంగ్​వ్యాలిడిటీ ఉంటుంది. ఈ పరీక్షను మొత్తం 20 భాషలలో నిర్వహిస్తారు. సీటెట్​స్కోర్‌తో కేంద్ర ప్రభుత్వం పరిధిలోని పాఠశాలల్లో ఉపాధ్యాయ నియామకాల్లో పరిగణనలోకి తీసుకుంటారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించే డీఎస్సీలో కూడా సీటెట్‌ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటారు.

ఇవి కూడా చదవండి

ముఖ్యమైన తేదీలు ఇవే..

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: సెప్టెంబర్‌ 17, 2024.
  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: అక్టోబర్‌ 16, 2024.
  • ఫీజు చెల్లింపులకు చివరి తేది: అక్టోబర్‌ 16, 2024.
  • ఆన్‌లైన్ దరఖాస్తు సవరణ తేదీలు: అక్టోబర్‌ 21 నుంచి 25, 2024 వరకు.
  • ఓఎమ్మార్‌ ఆధారిత పరీక్ష తేదీ: డిసెంబర్‌ 1, 2024.
  • సీటెట్ ఫలితాల విడుదల: జనవరి, 2025లో విడుదలయ్యే అవకాశం ఉంది.

సీటెట్‌ 2024 (సెప్టెంబర్‌) నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.