AP TET 2024 Exam: రేపట్నుంచి ‘టెట్‌ 2024’ ఆన్‌లైన్‌ మాక్‌ టెస్ట్‌లు.. హాల్‌టికెట్ల విడుదల తేదీ ఇదే

ఆంధ్రప్రదేశ్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌) జులై 2024 పరీక్షల హాల్‌ టికెట్లు ఈ వారంలో విడుదలవనున్నాయి. గురువారం (సెప్టెంబర్‌ 19) నుంచి ఆన్‌లైన్‌ మాక్‌ టెస్టులు నిర్వహిస్తున్నట్లు పాఠశాల విద్య డైరెక్టర్‌ విజయరామరాజు ఓ ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్‌ మాక్‌ టెస్టు పరీక్షలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాయడానికి వీలుకల్పిస్తున్నట్లు తెలిపారు. ఇక సెప్టెంబర్‌ 22 నుంచి టెట్‌ హాల్‌టికెట్లు..

AP TET 2024 Exam: రేపట్నుంచి 'టెట్‌ 2024' ఆన్‌లైన్‌ మాక్‌ టెస్ట్‌లు.. హాల్‌టికెట్ల విడుదల తేదీ ఇదే
AP TET 2024 Exam
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 18, 2024 | 7:27 AM

అమరావతి, సెప్టెంబర్‌ 18: ఆంధ్రప్రదేశ్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌) జులై 2024 పరీక్షల హాల్‌ టికెట్లు ఈ వారంలో విడుదలవనున్నాయి. గురువారం (సెప్టెంబర్‌ 19) నుంచి ఆన్‌లైన్‌ మాక్‌ టెస్టులు నిర్వహిస్తున్నట్లు పాఠశాల విద్య డైరెక్టర్‌ విజయరామరాజు ఓ ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్‌ మాక్‌ టెస్టు పరీక్షలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాయడానికి వీలుకల్పిస్తున్నట్లు తెలిపారు. ఇక సెప్టెంబర్‌ 22 నుంచి టెట్‌ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని.. షెడ్యూల్‌ ప్రకారమే అక్టోబరు మూడు నుంచి టెట్‌ పరీక్ష నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. నమూనా క్వశ్చన్‌ పేపర్లను http://cse.ap.gov.in వెబ్‌సైట్లో అందుబాటులో ఉంటాయని విజయరామరాజు తెలిపారు. ఏపీ టెట్ 2024 అధికారిక వెబ్‌సైట్‌ https://aptet.apcfss.in/ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

తెలంగాణ దోస్త్‌ ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ గడువు పెంపు.. రేపటితో ముగింపు

తెలంగాణ దోస్త్‌ ప్రత్యేక విడతలో సీట్లు పొందిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్, కాలేజీల్లో స్వయంగా రిపోర్ట్‌ చేసే గడువును సెప్టెంబర్‌ 19వ తేదీ వరకు పొడిగించినట్లు దోస్త్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి ఓ ప్రకటనలో తెలిపారు. ముందుగా ప్రకటించిన గడువు సోమవారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల వినతి మేరకు గడువును పెంచినట్లు ఆయన తెలిపారు.

ఐఐటీల్లో పెరిగిన అమ్మాయిల అడ్మిషన్లు.. జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2024 నివేదికలో వెల్లడి

దేశంలోని 23 ఐఐటీల్లో అమ్మాయిల ప్రవేశాలు గతేడాదితో పోల్చితే స్వల్పంగా పెరిగినట్లు జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2024 నివేదిక వెల్లడించింది. ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీలతోపాటు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే విద్యాసంస్థల్లో సీట్ల భర్తీకి జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ (జోసా) కౌన్సెలింగ్‌ ఆగస్టులో ముగిసింది. ఈ నేపథ్యంలో ‘జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2024’పై జాయింట్‌ ఇంప్లిమెంటేషన్‌ కమిటీ నివేదికను ఐఐటీ మద్రాస్‌ వెల్లడించింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష, జోసా కౌన్సెలింగ్‌లో ఏపీకి చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అన్నాబత్తుల రత్నకుమార్‌ కూడా ఉన్నారు. ఐఐటీ మద్రాస్‌ మెకానికల్‌ విభాగంలో పనిచేస్తున్న ఆయన జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు వైస్‌ ఛైర్మన్‌ 2గా పనిచేశారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2024కు 2,50,284 మంది అర్హత పొందగా.. వారిలో 1,80,200 మంది పరీక్షలు రాశారు. జోసా కౌన్సెలింగ్‌కు 48,248 మంది అర్హత సాధిస్తే అందులో 7,964 మంది (16.50 శాతం) అమ్మాయిలున్నారు. గతేడాది 43,596 మంది అర్హత సాధించగా.. అమ్మాయిల సంఖ్య 7,509 (17.22 శాతం). అర్హత పొందిన బాలికల శాతం ఈ సారి తగ్గినట్లు స్పష్టమవుతోంది. 23 ఐఐటీల్లో మొత్తం 17,760 సీట్లు ఉండగా అందులో 17,695 భర్తీ అయ్యాయి. వారిలో 3,495 మంది (19.75 శాతం) అమ్మాయిలు ఉన్నారు. గతేడాది 17,385 సీట్లలో వారి సంఖ్య 3,422 (19.70 శాతం). అత్యధికంగా ఖరగ్‌పుర్‌ ఐఐటీలో 363 మంది అమ్మాయిలు చేరారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.