Fees As Semester: ఫీజుల చెల్లింపులు కూడా సెమిస్టర్ విధానంలోనే ఉండాలి.. తెరపైకి కొత్త ప్రతిపాదన.. అమల్లోకి వచ్చేనా..?
Fees As Semester: ఉన్నత విద్యలో ప్రస్తుతం సెమిస్టర్ విధానం నడుస్తున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు కేవలం బీటెక్ వంటి టెక్నికల్ డిగ్రీలకు మాత్రమే పరిమితమైన సెమిస్టర్ విధానం ఇప్పుడు..
Fees As Semester: ఉన్నత విద్యలో ప్రస్తుతం సెమిస్టర్ విధానం నడుస్తున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు కేవలం బీటెక్ వంటి టెక్నికల్ డిగ్రీలకు మాత్రమే పరిమితమైన సెమిస్టర్ విధానం ఇప్పుడు.. సంప్రదాయ డిగ్రీలకు కూడా అమలు చేశారు. దీని ద్వారా ఎక్కువ సబ్జెక్టులు కవర్ చేయొచ్చు.. దీంతో విద్యార్థుల్లో విషయ పరిజ్ఞానం పెరుగుతుందన్న ఉద్దేశంతో ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే.. విద్యా విధానం సెమిస్టర్ విధానంలో ఉంటే, ఫీజుల వసూళ్లు మాత్రం ఏడాదికి ఒకేసారి ఉంటాయి. ఇప్పటి వరకు అన్ని విద్యా సంస్థలు ఇదే విధానాన్ని అవలంభిస్తున్నాయి.
ఈ క్రమలోనే తాజాగా తెరపైకి కొత్త వాదన వస్తోంది. ఎలాగైతే అకాడమిక్ ఇయర్‌ను సెమిస్టర్ విధానంలో నిర్వహిస్తున్నారో.. అదే పద్ధతిలో ఫీజులను కూడా వాయిదా పద్ధతిలో వసూళు చేయాలని ప్రతిపాదనకు మద్ధతు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో విద్యావేత్తలు, విద్యార్థుల తల్లిదండ్రులు కొత్త విధానాన్ని ప్రతిపాదిస్తున్నారు. రెండు సెమిస్టర్లకు కలిపి ఫీజును ఒకేసారి చెల్లించడం ఇబ్బందితో కూడుకున్న అంశం కాబట్టి. వాయిదా పద్ధతిలో ఫీజుల చెల్లింపుల విధానం ఉంటే వెసులుబాటు కలుగుతుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే ఫీజుల చెల్లింపును మూడు నుంచి నాలుగు వాయిదాల్లో తీసుకోవాలని ఏఐసీటీఈ కళాశాలలకు సూచించింది కూడా. ఇలా చేయడం వల్ల అకాడమిక్ ఇయర్ ప్రారంభం కంటే ముందే ఫీజులు వసూళు చేయడం ఎంత వరకు సబబు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి ఈ విషయమై కళాశాలలు ఎలా స్పందిస్తాయో చూడాలి.
Also Read: కోవెలకుంట్ల తహసీల్దార్ ఆఫీసు గదిలోనుంచి విచిత్ర శబ్ధాలు.. ఓపెన్ చేసి చూడగా 70 గుడ్లతో పైథాన్
సీఏ జాబ్ వదిలి తేనె బిజినెస్..! వివిధ రుచుల హనీ అమ్ముతూ లక్షలు గడించాడు.. ఎలాగో తెలుసుకోండి..