Teacher Jobs: సికింద్రాబాద్‌లోని బొల్లారం ఆర్మీస్కూల్‌లో టీచర్ ఉద్యోగాలు.. దరఖాస్తులు ఈ చిరునామాకు పంపండి..
Secunderabad army public school recruitment 2021: సికింద్రాబాద్‌లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ (ఏపీఎస్)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. బొల్లారంలో ఉన్న ఈ ఆర్మీ స్కూల్‌లో..
Secunderabad army public school recruitment 2021: సికింద్రాబాద్‌లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ (ఏపీఎస్)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. బొల్లారంలో ఉన్న ఈ ఆర్మీ స్కూల్‌లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా టీచర్ పోస్టులతో పాటు పలు ఇతర పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. మొత్తం 33 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి.
భర్తీచేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా పీజీటీ, టీజీటీ, పీఆర్‌టీ, కంప్యూటర్ సైన్స్ టీచర్లు, లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* హిస్టరీ, సైన్స్, జాగ్రఫీ, ఎకనామిక్స్, సైకాలజీ, మ్యాథ్స్, ఇంగ్లిష్, హిందీ, సోషల్ సైన్స్ విభాగాలకు పోస్టులు ఉన్నాయి.
* పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు(పీజీటీ) పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో 50శాతం మార్కులతో పోస్టు గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణులవ్వాలి.
* ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు(టీజీటీ) ఖాళీలకు అప్లై చేసుకునే వారు సంబంధిత విభాగంలో 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌లో ఉత్తీర్ణులవ్వాలి.
* ప్రైమరీ టీచర్లు(పీఆర్‌టీ) పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు.. సంబంధిత విభాగంలో 50శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
* లైబ్రేరియన్ పోస్టులకు బ్యాచిలర్ డిగ్రీ(లైబ్రరీ సైన్స్)/డిప్లొమా(లైబ్రరీ సైన్స్) ఉత్తీర్ణతను అర్హతగా నిర్ణయించారు. మూడేళ్ల అనుభవం తప్పనిసరి.
* సెక్యూరిటీ సూపర్‌వైజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు కంప్యూటర్‌లో ఎంఎస్ ఆఫీస్ పరిజ్ఞానం ఉండాలి. 55ఏళ్లు నిండిన ఎక్స్‌సర్వీస్‌మెన్‌లకు ప్రాధాన్యం ఉంటుంది.
* కంప్యూటర్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఇంటర్మీడియట్, డిప్లొమా(కంప్యూటర్ సైన్స్) ఉత్తీర్ణులవ్వాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు పూర్తి వివరాలను ఆఫ్‌లైన్ ద్వారా ఆర్మీ పబ్లిక్ స్కూల్, బొల్లారం, జేజే నగర్, సికింద్రాబాద్–500087 చిరునామాకు పంపించాలి.
* దరఖాస్తుల సమర్పణకు 05.06.2021ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి..