కోవెలకుంట్ల తహసీల్దార్ ఆఫీసు గ‌దిలోనుంచి విచిత్ర శ‌బ్ధాలు.. ఓపెన్ చేసి చూడ‌గా 70 గుడ్ల‌తో పైథాన్

క‌ర్నూలు జిల్లా జిల్లా కోవెలకుంట్లలో షాకింగ్ సీన్ వెలుగుచూసింది. పాత తహసీల్దార్ ఆఫీసులో కొండచిలువ గురువారం టెన్ష‌న్ రేపింది. బ్రిటీష్‌ కాలంలో నిర్మించిన....

కోవెలకుంట్ల తహసీల్దార్ ఆఫీసు గ‌దిలోనుంచి విచిత్ర శ‌బ్ధాలు.. ఓపెన్ చేసి చూడ‌గా 70 గుడ్ల‌తో పైథాన్
Big Python Kovelakuntla
Follow us
Ram Naramaneni

|

Updated on: May 21, 2021 | 8:30 AM

క‌ర్నూలు జిల్లా జిల్లా కోవెలకుంట్లలో షాకింగ్ సీన్ వెలుగుచూసింది. పాత తహసీల్దార్ ఆఫీసులో కొండచిలువ గురువారం టెన్ష‌న్ రేపింది. బ్రిటీష్‌ కాలంలో నిర్మించిన ఈ కార్యాలయంలో ప్రస్తుతం రెవెన్యూ అధికారులు రికార్డులు స్టోర్ చేస్తున్నారు. గురువారం ఓ గదిలో నుంచి విచిత్ర‌మైన శ‌బ్ధాలు వినిపించడంతో కొందరు ఉద్యోగులు తలుపు తెరిచి చూడగా భారీ కొండచిలువ కనిపించింది. త‌లుపులు తీయ‌గానే.. అది విప‌రీత‌మైన కోపంతో వారిమీద‌కు వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నించింది. అందుకు కార‌ణం అది గుడ్ల‌ను పొదుగుతుండ‌టం. దీంతో కంగారు పడిన సిబ్బంది వెంటనే తలుపు మూసేసి ఫారెస్ట్ అధికారులకు, పాములు ప‌ట్టే వ్య‌క్తుల‌కు సమాచారం ఇచ్చారు. స్పాట్ కు చేరుకున్న‌ కోవెలకుంట్ల తహసీల్దార్, బనగానపల్లె ఫారెస్టు అధికారులు అక్కడి పరిస్థితి అంచ‌నా వేశారు. పాము పూర్తిగా గుడ్లు పెట్టే వరకు వేచిచూసి ఆ త‌ర్వాత స్నేక్ క్యాచ‌ర్ ఉచ్చు వేశాడు.  అనుకున్నట్టుగానే కొండచిలువ ఉచ్చులో చిక్కింది. దాన్ని గోనెసంచిలో బంధించారు. ఆ గదిలో కొండచిలువ సుమారు 70 గుడ్లను పొదిగి ఉండటాన్ని స్టాఫ్ గుర్తించి.. షాక్ తిన్నారు. పాములు పట్టే వ్యక్తి కొండచిలువను, గుడ్లను వెలికితీశాడు. బనగానపల్లి అటవీ శాఖ అధికారులు కొండచిలువను, గుడ్లను తీసుకెళ్లారు. స్థానికంగా ఈ ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది.

Also Read: టెన్ష‌న్… టెన్ష‌న్.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై నేడు తీర్పు వెలువ‌రించ‌నున్న హైకోర్టు

కరోనాతో మృతిచెందిన కార‌వ్యాన్ డ్రైవ‌ర్ కుటుంబానికి మెగాస్టార్ ఆర్ధిక సాయం..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!