AP MPTC, ZPTC results date 2021: టెన్షన్… టెన్షన్.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై నేడు తీర్పు వెలువరించనున్న హైకోర్టు
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల విషయంలో నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తుది తీర్పు వెలువరించనుంది. పోలింగ్ తేదీకి 4వారాల ముందు ఎలక్షన్ కోడ్ విధించాలన్న....
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల విషయంలో నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తుది తీర్పు వెలువరించనుంది. పోలింగ్ తేదీకి 4వారాల ముందు ఎలక్షన్ కోడ్ విధించాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా పరిషత్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చిందంటూ టీడీపీ నేత వర్ల రామయ్య కోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి .. ఏప్రిల్ 8 న జరగనున్న ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేస్తూ 6 వ తేదీన మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. దీనిపై ఎస్.ఈ.సీ అప్పీల్ దాఖలు చేయగా ఎన్నికల నిర్వహణకు అనుమతిచ్చి..లెక్కింపు ప్రక్రియ నిలుపుదల చేసింది. దీనిపై లోతుగా విచారణ జరపాల్సిందిగా సింగిల్ జడ్జికి హైకోర్టు అప్పగించింది. దీంతోపాటు జనసేన, బీజేపీ నేతలు దాఖలు చేసిన వ్యాజ్యాలపైనా సింగిల్ జడ్జి ఈనెల 4 న విచారణ జరిపి తీర్పును రిజర్వు చేశారు. న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణ మూర్తి ఉదయం 10:30 గంటలకు నిర్ణయాన్ని వెల్లడించనున్నారు. హైకోర్టు ఇచ్చే తీర్పుతో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ పై క్లారిటీ రానుంది.
Also Read: మళ్లీ పెరిగిన పసిడి ధరలు.. శుక్రవారం ప్రధాన నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..?