Constable Jobs: గుడ్‌న్యూస్! 1149 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఏపీ, తెలంగాణలో ఎన్ని పోస్టులంటే..
భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) దేశ వ్యాప్తంగా తాత్కాలిక పాతిపదికన కానిస్టేబుల్ పోస్టుల (Constable Jobs) భర్తీకి అర్హులైన పురుష (Male candidates)అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
CISF Constable/ Fire (Male) Recruitment 2022: భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) దేశ వ్యాప్తంగా తాత్కాలిక పాతిపదికన కానిస్టేబుల్ పోస్టుల (Constable Jobs) భర్తీకి అర్హులైన పురుష (Male candidates)అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 1149
ఖాళీల వివరాలు: కానిస్టేబుల్/ఫైర్
తెలుగు రాష్టాల్లో ఖాళీల వివరాలు:
తెలంగాణలో: 30
ఆంధ్రప్రదేశ్‌లో: 79
అర్హతలు: సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ లేదా తత్సమాన అర్హత ఉండాలి. అలాగే నిర్దేశిత శారీరక ప్రమాణాలుండాలి. పురుుష అభ్యర్ధులు మాత్రమే అర్హులు.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు మార్చి 4, 2022 నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్ధులు మార్చి 5, 1999 నుంచి మార్చి 4, 2004 మధ్య జన్మించి ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.21,700 నుంచి 69,100లతోపాటు ఇతర అలవెన్సులు వర్తిస్తాయి.
ఎంపిక విధానం: ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్/ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
రాత పరీక్ష విధానం: పీఈటీ/పీఎస్టీలో అర్హత సాధించిన అభ్యర్ధులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. CBT మోడ్‌లో మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. 100 ఆబ్జెక్టివ్ మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు సమాధానాలు రాయవల్సి ఉంటుంది. ఈ పరీక్ష ఇంగ్లీష్/హిందీ మాధ్యమాల్లో నిర్వహిస్తారు. ఐతే నెగెటివ్ మార్కింగ్ ఉండదు. అన్ని ప్రశ్నలకు రెండు గంటల్లో సమాధానాలు రాయవల్సి ఉంటుంది.
క్వశ్చన్ పేపర్ మోడల్: జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్: 25 ప్రశ్నలు జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్: 25 ప్రశ్నలు ఎలిమెంటరీ మ్యాథమేటిక్స్: 25 ప్రశ్నలు ఇంగ్లీష్/హిందీ భాషా నైపుణ్యం: 25 ప్రశ్నలు
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము: ఓబీసీ, ఇతర అభ్యర్ధులు రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్ధులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
దరఖాస్తులకు ప్రారంభ తేదీ: జనవరి 29, 2022.
దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 4, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: