Chandigarh University: బజాజ్‌ ఆటోతో చంఢీఘడ్‌ యూనివర్సిటీ ఒప్పందం.. తొలి ‘బెస్ట్‌’ సెంటర్‌ ఏర్పాటు.

ఈ ప్రోగ్రామ్‌ ద్వారా యూనివర్సిటీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్ స్కిల్స్‌ కోసం వచ్చే మూడేళ్లలో రూ. 20 కోట్ల ఖర్చు చేయనున్నారు. టైర్ 2, టైర్ 3, టైర్‌ 4 నగరాల్లోని కాలేజీల్లో గ్రాడ్యుయేట్‌, డిప్లొమా ఇంజీనిరంగ్‌ను పూర్తి చేసిన వారికి నైపుణ్యాలను పెంపొదించడంతో పాటు ఉద్యోగవకాశాలు కల్పించడం ఈ బెస్ట్ ముఖ్య ఉద్దేశం. గత గురువారం చంఢీఘడ్‌ యూనివర్సిటీ...

Chandigarh University: బజాజ్‌ ఆటోతో చంఢీఘడ్‌ యూనివర్సిటీ ఒప్పందం.. తొలి 'బెస్ట్‌' సెంటర్‌ ఏర్పాటు.
Chandigarh University
Follow us

|

Updated on: Jul 02, 2024 | 2:17 PM

ఎప్పటికప్పుడు సరికొత్త కోర్సులను ప్రవేశపెడుతూ విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచుతూ, ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్న చంఢీఘడ్‌ యూనివర్సిటీ తాజాగా మరో కీలక అడుగు వేసింది. భారత దేశంలో టాప్‌ ప్రైవేటీ యూనివర్సిటీగా పేరు తెచ్చుకున్న చంఢీఘడ్‌ యూనివర్సిటీ తాజాగా బజాజ్‌ ఆటో లిమిటెడ్‌తో కీలక ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా పంజాబ్‌లో తొలి ‘బజాజ్‌ ఇంజనీరింగ్ స్కిల్‌ ట్రైనింగ్‌’ (బెస్ట్‌) సెంటర్‌ను ఏర్పాటు చేశారు. తయారీ రంగంలో అధునాతన టెక్నాలజీపై విద్యార్థులకు అవగాహన కల్పించడమే ఈ ప్రోగ్రామ్‌ ముఖ్య ఉద్దేశం.

ఈ ప్రోగ్రామ్‌ ద్వారా యూనివర్సిటీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్ స్కిల్స్‌ కోసం వచ్చే మూడేళ్లలో రూ. 20 కోట్ల ఖర్చు చేయనున్నారు. టైర్ 2, టైర్ 3, టైర్‌ 4 నగరాల్లోని కాలేజీల్లో గ్రాడ్యుయేట్‌, డిప్లొమా ఇంజీనిరంగ్‌ను పూర్తి చేసిన వారికి నైపుణ్యాలను పెంపొదించడంతో పాటు ఉద్యోగవకాశాలు కల్పించడం ఈ బెస్ట్ ముఖ్య ఉద్దేశం. గత గురువారం చంఢీఘడ్‌ యూనివర్సిటీ క్యాంపస్‌లో చేపట్టిన ఎమ్‌ఓయూపై వర్సిటీ వైస్ ఛాన్స్‌లర్‌ డాక్టర్ మన్‌ప్రీత్ సింగ్ మన్నా, డైరెక్టర్ జనరల్ చండీగఢ్ యూనివర్శిటీ, శ్రీ హృదయ్ష్ పరశురామ్ దేశ్‌పాండేతో పాటు బజాజ్ ఆటో అధికారులు శ్రీ సుధాకర్ గుడిపాటి సమక్షంలో సంతకాలు చేశారు.

ఈ బెస్ట్‌ సెంటర్‌ ద్వారా ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన యువతకు అభివృద్ధి చెందుతున్న సాంకేతిక నైపుణ్యాలను పొందడంతో పాటు ఉపాధి పొందే అవకాశాలను కల్పిస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ బెస్ట్‌ కోర్సులు ట్రైనీలకు ఉపాధి లభించే నైపుణ్యాలను అందించనున్నారు. ఇందులో భాగంగా మెకాట్రానిక్స్‌, మోషన్‌ కంట్రోల్‌, సెన్సార్‌ టెక్నాలజీ, రోబోటిక్స్‌, ఆటోమేషన్‌, ఇండస్ట్రీ 4.0, స్మార్ట్‌ మ్యానిఫ్యాక్షరింగ్ వంటి రంగాల్లో శిక్షణ అందించనున్నారు.

Best

ఈ విషయమై చంఢీఘడ్‌ యూనివర్సిటీ ఛాన్సిలర్‌, రాజ్యసభ సభ్యుడు సత్నామ్‌ సింగ్ సింధు మాట్లాడుతూ.. విద్యతో పాటు పరిశ్రమల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి బజాజ్ ఆటోతో చేసుకున్న ఈ అవగాహన ఒప్పందం ఉపయోగపడుతుందని తెలిపారు. దేశంలోని విద్యార్థులు పరిశ్రమలకు అవసరమయ్యే నైపుణ్యాలతో సిద్ధంగా ఉంటారని చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఎడ్యుకేషన్‌ పాలసీ 2020కి ఈ బెస్ట్‌ కోర్సులు బలేపేతం చేస్తుందని సత్నామ్‌ సింగ్ అభిప్రాయపడ్డారు. చంఢీఘడ్‌ యూనివర్సిటీ నిత్యం నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తుందని చెప్పుకొచ్చారు.

ఇక బజాజ్‌ ఆటో వీపీ-సీఎస్‌ఆర్‌ సుధాకర్‌ మాట్లాడుతూ.. భారతదేశంలో ఉన్న యువతలో నైపుణ్యాలను పెంచే ఉద్దేశంతో చంఢీఘడ్‌ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. దీని ద్వారా తయారీ రంగంలో ఉపాధి పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..