CUPB Non Teaching Jobs: సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ పంజాబ్‌లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు.. టెన్త్/ఇంటర్ పాసైతే చాలు..
సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ పంజాబ్.. 36 రెగ్యులర్/డిప్యుటేషన్ ప్రాతిపదికన 36 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల..
సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ పంజాబ్.. 36 రెగ్యులర్/డిప్యుటేషన్ ప్రాతిపదికన 36 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫైనాన్స్ ఆఫీసర్, డిప్యూటీ లైబ్రేరియన్, ఇన్ఫర్మేషన్ సైంటిస్ట్, సెక్యూరిటీ ఆఫీసర్, ప్రైవేట్ సెక్రటరీ, సెక్షన్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్, ఫార్మసిస్ట్, హిందీ ట్రాన్స్‌లేటర్, స్టాటిస్టికల్ అసిస్టెంట్, లోయర్ డివిజన్ క్లర్క్, కుక్, డ్రైవర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ల్యాబొరేటరీ అటెండెంట్.. తదితర ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్త చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి పోస్టును బట్టి పదో తరగతి, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్/డిగ్రీ/పీజీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 30 నుంచి 57 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్న అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో నవంబర్ 25, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 29, 2022వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. జనరల్ అభ్యర్ధులు రూ.600లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/వికలాంగ/మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. స్కిల్ టెస్ట్/రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ప్రతిభ కనబరచిన వారికి నెలకు రూ.18,000ల నుంచి రూ.1,44,200ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు అధికారిక నోటిఫకేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.