Central Silk Board Jobs 2022: సెంట్రల్ సిల్క్ బోర్డులో ఈ పోస్టులకు ఇంకా దరఖాస్తు చేసుకోలేదా? ఈ రోజే ఆఖరు..
భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వశాఖకు చెందిన బెంగళూరులోని సెంట్రల్ సిల్క్ బోర్డులో 66 సైంటిస్ట్ బి పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా? ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఈ రోజుతో ముగియనుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని..
భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వశాఖకు చెందిన బెంగళూరులోని సెంట్రల్ సిల్క్ బోర్డులో 66 సైంటిస్ట్ బి పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా? ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఈ రోజుతో ముగియనుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు నవంబర్ 17వ తేదీ ముగింపు సమయంలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. జనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్, ప్లాంట్ పాథాలజీ, సెరీ కల్చర్, మైక్రోబయాలజీ, ప్లాంట్ సైకాలజీ, యానిమల్ జెనెటిక్స్ అండ్ బ్రీడింగ్, యానిమల్ న్యూట్రీషన్, సాయిల్ సైన్సెస్, అగ్రికల్చరల్ ఎకనామిక్స్ తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎమ్మెస్సీ/అగ్రికల్చర్ సైన్స్ విభాగాల్లో పీజీ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. ఐసీఎమ్‌ఆర్ (పీహెచ్‌డీ) జేఆర్‌ఎఫ్/ఎస్‌ఆర్‌ఎఫ్-2022లో ర్యాంక్ ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 35 ఏళ్లకు మించకుండా ఉండాలి.
ఈ అర్హతలున్నవారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఐతే జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ/ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్ధులు రూ.1000లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికై అభ్యర్ధులకు నెలకు 56,100ల నుంచి రూ.1,77,500ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.