VMMC Recruitment 2022: నెలకు రూ.51,100ల జీతంతో.. వర్ధమాన్ మహవీర్ మెడికల్ కాలేజీలో 299 ఉద్యోగాలు..
న్యూఢిల్లీలోని గురుగోవింద్ సింగ్ ఇంద్రప్రస్థా యూనివర్సిటీ ఆధ్వర్యంలోని వర్ధమాన్ మహవీర్ మెడికల్ కాలేజీ, సఫ్దర్‌జంగ్ హాస్పిటల్.. 299 జూనియర్ రెసిడెంట్ (నాన్-పీజీ) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు..
న్యూఢిల్లీలోని గురుగోవింద్ సింగ్ ఇంద్రప్రస్థా యూనివర్సిటీ ఆధ్వర్యంలోని వర్ధమాన్ మహవీర్ మెడికల్ కాలేజీ, సఫ్దర్‌జంగ్ హాస్పిటల్.. 299 జూనియర్ రెసిడెంట్ (నాన్-పీజీ) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్/బీడీఎస్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఢిల్లీ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయ్యి ఉండాలి.
ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ విధానంలో సెప్టెంబర్ 28, 2022 తేదీ మధ్యాహ్నం 3 గంటలలోపు పోస్టు ద్వారా కింది అడ్రస్‌కు దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ అభ్యర్ధులకు రూ.500లు, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్ధులు రూ.250లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అర్హత సాధించిన అభ్యర్ధులకు నెలకు రూ.51,100ల వరకు జీతంగా చెల్లిస్తారు. పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
అడ్రస్:
The Medical Superintendent, VMMC, Safdarjung Hospital, New Delhi
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.