AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Success Story: వ్యర్థ ఉత్పత్తులతో అదిరే బిజినెస్.. క్యారీ బ్యాగ్‌ల వ్యాపారంలో రాణిస్తున్న మహిళ

ఛత్తీసగడ్ రాష్ట్రం బిలాస్‌పూర్‌కు చెందిన సోనాల్ అగర్వాల్ కూడా ఇలా వినూత్న ఆలోచనతో వ్యాపార రంగంలో రాణిస్తుంది.  మొదట్లో సోనాల్ పాత చీరలు, చున్నీ, బట్టలను బ్యాగులు తయారు చేసి మార్కెట్‌లో విక్రయించేది. ఆమె తన వ్యాపార కార్యకలాపాలను విస్తరించడానికి వివిధ నగరాల్లో ప్రదర్శనలు కూడా నిర్వహించింది. వ్యర్థ పదార్థాల నుంచి ఉపయోగపడే ఉత్పత్తులను తయారు చేసే వ్యాపార నమూనాను చాలా మంది అనుసరిస్తున్నారని ఆమె తెలుసుకుంది. అటు వైపుగా అడుగులు వేసి సక్సెస్ అయ్యింది.

Success Story: వ్యర్థ ఉత్పత్తులతో అదిరే బిజినెస్.. క్యారీ బ్యాగ్‌ల వ్యాపారంలో రాణిస్తున్న మహిళ
Sonal Agarwal
Nikhil
|

Updated on: May 01, 2024 | 5:15 PM

Share

ప్రస్తుత రోజుల్లో యువత ఎక్కువగా వ్యాపారం వైపు మొగ్గు చూపుతున్నారు. మారుతున్న ఆలోచనల కారణంగా ఒకరి కింది పని చేయడం కంటే మనకు మనమే బాస్‌గా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో వినూత్న ఆలోచనలతో సరికొత్త వ్యాపార మార్గాలను అన్వేషిస్తున్నారు. ఛత్తీసగడ్ రాష్ట్రం బిలాస్‌పూర్‌కు చెందిన సోనాల్ అగర్వాల్ కూడా ఇలా వినూత్న ఆలోచనతో వ్యాపార రంగంలో రాణిస్తుంది.  మొదట్లో సోనాల్ పాత చీరలు, చున్నీ, బట్టలను బ్యాగులు తయారు చేసి మార్కెట్‌లో విక్రయించేది. ఆమె తన వ్యాపార కార్యకలాపాలను విస్తరించడానికి వివిధ నగరాల్లో ప్రదర్శనలు కూడా నిర్వహించింది. వ్యర్థ పదార్థాల నుంచి ఉపయోగపడే ఉత్పత్తులను తయారు చేసే వ్యాపార నమూనాను చాలా మంది అనుసరిస్తున్నారని ఆమె తెలుసుకుంది. అటు వైపుగా అడుగులు వేసి సక్సెస్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆమె సక్సెస్ స్టోరీ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

సోనాల్ అగర్వాల్ తాను చేస్తున్న వ్యాపారాన్ని వీడి క్యారీ బ్యాగ్‌లను తయారు చేయడం ప్రారంభించింది. మొదటి నుంచి సోనాల్ ఉద్యోగం వైపు కాకుండా వ్యాపార రంగంలో స్థిరపడాలనే తలంపుతో కష్టమైన ఇష్టపడి పని చేసి సక్సెస్ అయ్యింది. వ్యర్థాలతో సంచులను తయారు చేయడంలో మొదట్లో విజయం సాధించలేకపోయినా క్యారీ బ్యాగ్ రంగంలో మాత్రం ఈ ఉత్పత్తి బాగా క్లిక్ అయ్యింది. ఆమె కంపెనీ ఉత్పత్తి చేసిన క్యారీ బ్యాగ్‌లను మాల్స్, దుకాణాలు, మార్కెట్లు, ఇతర ప్రదేశాలలో కూడా విక్రయిస్తారు. ఆమె ఉత్పత్తి యూనిట్ మార్కెట్‌లో నెలవారీ 20,000 క్యారీ బ్యాగ్‌లను విక్రయిస్తుంది. వాటి ఆదాయాలు కూడా కాలక్రమేణా పెరిగాయి. ఈ సంచులు పెద్దమొత్తంలో విక్రయిస్తారు. వాటి ధరల పరిధి నామమాత్రపు ధర రూ. 100 నుండి అనేక వేల రూపాయల వరకు ఉంటుంది.

సోనాల్ ఇప్పుడు తన వ్యాపారం కోసం పెద్ద ప్రణాళికలతో ఉంది. ముఖ్యంగా మరింత పెద్ద స్థాయిలో ఫ్యాక్టరీని స్థాపించడం ద్వారా దాని కార్యకలాపాలను పెంచుకోవాలని ఆమె కోరుకుంటోంది. కొత్త కర్మాగారంలో భారీ పరిమాణంలో బ్యాగులను తయారు చేయడంతో పాటు ఆర్థికంగా ఆదుకోవడానికి ఎవరూ లేని నిరుద్యోగ మహిళలను నియమించాలని ఆమె లక్ష్యంగా పెట్టుకుంది. అలాంటి మహిళలను స్వావలంబనగా తీర్చిదిద్దాలని తద్వారా వారు గౌరవప్రదంగా జీవనోపాధి పొందాలని సోనాల్ ఆకాంక్షిస్తుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.