BECIL Recruitment: బీఈసీఐఎల్‌లో టెక్నికల్ పోస్టులు.. టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వారు అర్హులు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..
BECIL Recruitment 2021: బ్రాడ్‌కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ సమాచారం, ప్రసార మంత్రిత్వశాఖకి చెందిన నోయిడాలోని..
BECIL Recruitment 2021: బ్రాడ్‌కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ సమాచారం, ప్రసార మంత్రిత్వశాఖకి చెందిన నోయిడాలోని ఈ సంస్థలో పలు ఉద్యోగాలను కాంట్రాక్ట్ విధానంలో తీసుకోనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 10 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో అప్లికేషన్ డెవలపర్ (05), ఎస్‌ఏబీ/ ఏబీఏపీ డెవలపర్ (05), యూఐ డెవలపర్ (01), ఎస్‌ఓసీ ఇంనీరింగ్ (02) పోస్టులు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టులను అనుసరించి బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ/ బీటెక్ / ఎమ్మెస్సీ, ఎంసీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో టెక్నికల్ నైపుణ్యాలతో పాటు పని అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* ఎంపికైన అభ్యర్థులకు ఏడాదికి రూ. 5 లక్షలు జీతంగా చెల్లిస్తారు.
* అభ్యర్థులను మొదట పని అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. అనంతరం ఇంటర్వూ ద్వారా తుది ఎంపిక చేస్తారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Zodiac Signs: ఈ రాశుల వారు అద్భుతమైన వినయంతో ఉంటారు.. ఏ రాశుల వారంటే..
Viral News: కూలీ తలపై పడిన అరటిపండ్లు.. 4 కోట్ల పరిహారం చెల్లించుకున్న యజమాని..!
చైతూ సామ్ వ్యవహారంలో నెటిజన్‌కు ఘాటుగా బదులిచ్చిన ఖుష్బూ.. వీడియో