Birla Institute PHD: బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పీహెచ్‌డీ ప్రవేశాలకు నోటిఫికేషన్.. ఎవరు అర్హులంటే..
Ranchi birla Institute Technology: రాంచీలోని బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 2021 విద్యాసంవత్సరానికిగాను వివిధ విభాగాల్లోని పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ కోర్సులను బిట్స్...
Ranchi birla Institute Technology: రాంచీలోని బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 2021 విద్యాసంవత్సరానికిగాను వివిధ విభాగాల్లోని పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ కోర్సులను బిట్స్ మెయిన్ క్యాంపస్‌తో పాటు.. జైపూర్, డియోఘర్, నోయిడా, పట్నా క్యాంపస్‌లు అందిస్తున్నాయి.
కోర్సుల వివరాలు, అర్హతలు..
* పీహెచ్‌డీ (ఫుల్‌టైమ్/పార్ట్‌టైమ్) సీట్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. * దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. సబ్జెక్టులో 60 శాతం మార్కులతో ఎంఈ, ఎంటెక్, ఎమ్మెస్సీ (ఇంజినీరింగ్), ఎంఆర్క్, ఎంఫార్మసీ, ఎంప్లానింగ్ ,ఎమ్మెస్సీ, ఎంసీఏ, ఎంబీఏ లేదా తత్సమాన డిగ్రీలలో ఏదో ఒకటి ఉత్తీర్ణులై ఉండాలి.
ముఖ్యమైన విషయాలు…
* అభ్యర్థులను ఆన్‌లైన్ రాతపరీక్ష, అకడమిక్ కెరీర్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
* జనరల్ అభ్యర్థులకు రూ. 2,500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ. 1500ను ఫీజుగా నిర్ణయించారు.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* దరఖాస్తులకు చివరి తేదీగా జూన్ 10ని నిర్ణయించారు.
* ఆన్‌లైన్ విధానంలో ఈ ఎంట్రెన్స్ టెస్ట్‌ను జూన్ 17న నిర్వహించనున్నారు.
* ఇంటర్వ్యూ జూన్ 18న ఉంటుంది.
* పూర్తి వివరాలకు www.bitmesra.ac.in ఈ వెబ్‌సైట్‌ను సందర్శించడి.
ఈ నోటు మీ దగ్గర ఉందా ? అయితే ఇలా చేస్తే మీరు కోటీశ్వరులు అయినట్టే.. ఏ నోటుకు ఎంత విలువ ఉందంటే..