BCCL Recruitment 2023: డిగ్రీ అర్హతతో కేంద్ర బొగ్గుగనుల సంస్థలో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
భారత ప్రభుత్వ బొగ్గు గనుల మంత్రిత్వశాఖకు చెందిన జార్ఖండ్ రాష్ట్రం ధన్‌బాద్‌లోని కోల్ ఇండియా లిమిటెడ్ పరిధిలోని భారత్ కొకింగ్ కోల్ లిమిటెడ్ (బీసీసీఎల్).. 77 జూనియర్ ఓవర్‌మ్యాన్ (గ్రేడ్-సి) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

భారత ప్రభుత్వ బొగ్గు గనుల మంత్రిత్వశాఖకు చెందిన జార్ఖండ్ రాష్ట్రం ధన్‌బాద్‌లోని కోల్ ఇండియా లిమిటెడ్ పరిధిలోని భారత్ కొకింగ్ కోల్ లిమిటెడ్ (బీసీసీఎల్).. 77 జూనియర్ ఓవర్‌మ్యాన్ (గ్రేడ్-సి) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. డిప్లొమా/ డిగ్రీ (మైనింగ్ ఇంజినీరింగ్)తో పాటు వ్యాలిడ్ ఓవర్‌మ్యాన్‌షిప్ కాంపిటెన్సీ సర్టిఫికేట్, గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికేట్, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కలిగిన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్ధుల వయసు 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులకు వయోపరిమితి విషయంలో రిజర్వేషన్ వర్తిస్తుంది.
ఆసక్తి కలిగిన వారు ఆఫ్‌లైన్ విధానంలో కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా మే 25, 2023వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.1180 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు చెందిన వారికి ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. ఆన్‌లైన్ రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ప్రతిభకనబరచిన వారికి నెలకు రూ.31,852ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
అడ్రస్..
The General Manager, (Personnel/EE), Bharat Coking Coal Limited, Koyla Bhawan, BCCL Township, Dhanbad District, Jharkhand- 826005.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.