AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BARC Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. బార్క్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్.. ఏ ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే..?

BARC Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త. దేశంలోని ప్రధాన పరిశోధన సంస్థ బాబా అటామిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌ (బార్క్‌) నుంచి ఉద్యోగ ప్రకటన వెలువడింది. 31 రీసెర్చ్‌ అసోసియేట్‌ పోస్టులను భర్తీ చేయడానికి

BARC Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. బార్క్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్.. ఏ ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే..?
Barc
uppula Raju
|

Updated on: Apr 12, 2021 | 11:51 AM

Share

BARC Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త. దేశంలోని ప్రధాన పరిశోధన సంస్థ బాబా అటామిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌ (బార్క్‌) నుంచి ఉద్యోగ ప్రకటన వెలువడింది. 31 రీసెర్చ్‌ అసోసియేట్‌ పోస్టులను భర్తీ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అభ్యర్థులు barc gov.in అధికారికి వెబ్‌ సైట్‌సందర్శించడం ద్వారా నోటిఫికేషన్, దరఖాస్తు ఫారంను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది 10 మే 2021గా నిర్ణయించారు. మెరిట్ ఆధారంగా ఎంపికైన అభ్యర్థి బాబా అటామిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌లో రీసెర్చ్‌ అసోసియేట్‌గా పనిచేసే అవకాశం లభిస్తుంది.

బాబా అటామిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌ నోటిఫికేషన్ ప్రకారం.. అభ్యర్థి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెటిరీయల్‌ సైన్స్, ఎర్త సైన్స్, బయోకెమిస్ట్రీ సైన్స్, జువాలజీ, బయోటెక్నాలజీ, మైక్రో బయాలజీ, డైరీ మైక్రో బయాలజీ, దాని సంబంధింత రంగాలలో పీహెచ్‌డీ ఉండాలి. ఇది కాకుండా, అభ్యర్థికి పరిశోధన, డెవలప్‌ మెంట్, సంబంధిత కంప్యూటర్ నైపుణ్యాలు, సంస్థాగత నైపుణ్యాలు, మౌఖిక, రాతపూర్వక కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సుధీర్ఘ అనుభవం ఉండాలి.

అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు 10 మే 2021 లోపు బాబా అటామిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌ కార్యాలయంలో సంప్రదించవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫారంలో బార్క్‌ నిర్దేశించిన ఫార్మాట్‌లో, అకాడమిక్‌, అనుభవానికి మించిన ఫొటో కాపీ సెట్‌ను జతచేసి సమర్పించాలి. అభ్యర్థులు దరఖాస్తులను డిప్యూటీ ఎస్టాబ్లిష్‌మెంట్ ఆఫీసర్, రిక్రూట్‌మెంట్-వి. సెంట్రల్ కాంప్లెక్స్ ట్రోంబే, ముంబైకి పంపంచాలి. ఇదిలా ఉంటే.. ఏప్రిల్ 11 న ఉదయం 11 గంటలకు జరగాల్సిన ఎంఎస్సి (హెచ్‌ఆర్‌పి), ఎంఎస్‌సి (ఎన్‌ఎంఎంఐటి) అభ్యర్థుల ఎంపిక కోసం జరిగే సాధారణ ప్రవేశ పరీక్షను బార్క్ వాయిదా వేసింది.

ఏపీలో గ్రామ వాలంటీర్ల కళ్లల్లో ఆనందం.. సేవలకు సత్కారాలు, నగదు ప్రోత్సాహకాలు, లాంఛనంగా ప్రారంభించిన సీఎం జగన్‌

Jan Dhan Bank Account: మీ బ్యాంక్ ఖాతాను జన్‌ధన్ అకౌంట్‌గా మార్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఇలా చేయండి..!

Kunja Bojji: భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జి మృతి.. సంతాపం తెలిపిన కమ్యూనిస్ట్ పార్టీల నేతలు!

చేతిలోనే విమానం .. ఈ స్టైల్ బ్యాగ్ ఎప్పుడైనా చూశారా ? ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..