చేతిలోనే విమానం .. ఈ స్టైల్ బ్యాగ్ ఎప్పుడైనా చూశారా ? ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Louis vuitton airplane Bag: సాధరణంగా బ్యాగ్స్ అంటే ఎలా ఉంటాయి.. ప్లేన్ డిజైన్స్ లేదా పువ్వుల అలంకరించుకున్న డిజైన్స్‏లో కనిపిస్తుంటాయి. ఇక చిన్న పిల్లల బ్యాగ్స్

చేతిలోనే విమానం .. ఈ స్టైల్ బ్యాగ్ ఎప్పుడైనా చూశారా ? ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
Louis Vuitton Airplane Bag
Rajitha Chanti

|

Apr 12, 2021 | 11:41 AM

Louis vuitton airplane Bag: సాధరణంగా బ్యాగ్స్ అంటే ఎలా ఉంటాయి.. ప్లేన్ డిజైన్స్ లేదా పువ్వుల అలంకరించుకున్న డిజైన్స్‏లో కనిపిస్తుంటాయి. ఇక చిన్న పిల్లల బ్యాగ్స్ మాత్రం టెడ్డీ బొమ్మలతో అందంగా ఉంటాయి. కానీ విమానాకారంలో ఉన్న బ్యాగ్ ఎప్పుడైనా చూశారా. ఏంటీ ఆశ్చర్యపోతున్నారా ? అవునండి విమానాకారంలో బ్యాగ్.. వినడానికి కొత్తగా ఉన్నా.. అచ్చం విమానమే బ్యాగ్ రూపంలో ఉందా అనే విధంగా దీనిని తయారు చేశారు. ఈ బ్యాగుకు అచ్చం విమానం మాదిరిగానే రెక్కలను కూడా సెట్ చేశారు. ఇలాంటి డిఫరెంట్ బ్యాగులను తయారు చేయడంలో ప్రముఖ లూయిస్ విట్టన్ బ్యాగులు. ఈ సంస్థ అత్యంత ఖరీదైన బ్యాగులను వింత వింత రకాలుగా తయారుచేస్తుంది…

ప్రముఖ లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ కొత్త రకం బ్యాగ్‏తో ముందుకు వచ్చింది. ఈ ఏడాది ప్రారంభంలోనే అమెరికన్ డిజైనర్ వర్జిల్ అబ్లో ఫాల్ వింటర్ 2021తో ఈ బ్యాగును పరిచయం చేశాడు. ఇందులో పురుషుల ఆర్కిటైప్‏ల బ్రాండ్ గా ఉండే దుస్తులతోపాటు క్యారియర్ బ్యాగులు కూడా ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా విమానం ఆకారంలో ఉన్న బ్యాగ్ ధర రూ. 28 లక్షలు. (RS. 28, 61, 235/-) ఈ బ్యాగులను లూయిస్ విట్టన్ యొక్క సాంప్రదాయ మోనోగ్రామ్ లోగోతో అలంకరిస్తారు. ఇంతకు ముందు ఈ లూయిస్ విట్టన్ క్యారియల్ బ్యాగులు బంగాళా దుంప బుట్టల ఆకారంలో ఉండగా.. మరికొన్ని వస్తువుల ఆకారంలో ఉన్నాయి. ఇక ఈ విమానాకారంలో ఉన్న బ్యాగు పురుషుల ఆర్కిటైప్స్ లో ఉన్నాయి. ప్రస్తుతం ఈ బ్యాగ్ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతన్నాయి. ఈ డిఫరెంట్ బ్యాగ్ చూసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

ట్వీట్..

Also Read: మళ్లీ పోటీపడుతున్న కమల్, రజనీ.. దాదాపు 16 ఏళ్ళ తర్వాత సీన్ రిపీట్.. అభిమానులకు ఇక పండగే..

Akkineni Naga Chaitanya: ఇక్కడ సినిమా పూర్తిచేసుకున్న ‘థ్యాంక్యు’.. ఇటలికి పయనమైన నాగచైతన్య…

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu