APVVP Prakasam Recruitment 2022: పదో తరగతి అర్హతతో ప్రకాశం జిల్లా ఏపీవీవీపీలో ఉద్యోగాలు.. నెలకు రూ.52,000ల జీతం..
ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ (APVVP)కు చెందిన ప్రకాశం జిల్లా (Prakasam District)లో.. ఒప్పంద/ ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ ఆసుపత్రుల్లో బయో మెడికల్ ఇంజినీర్, థియేటర్ అసిస్టెంట్, పోస్ట్ మార్టం అసిస్టెంట్ పోస్టుల (Bio Medical Engineer Posts) భర్తీకి..
APVVP Prakasam District Medical Staff Recruitment 2022: ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ (APVVP)కు చెందిన ప్రకాశం జిల్లా (Prakasam District)లో.. ఒప్పంద/ ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ ఆసుపత్రుల్లో బయో మెడికల్ ఇంజినీర్, థియేటర్ అసిస్టెంట్, పోస్ట్ మార్టం అసిస్టెంట్ పోస్టుల (Bio Medical Engineer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 12
ఖాళీల వివరాలు:
- బయో మెడికల్ ఇంజినీర్ పోస్టులు: 1
- థియేటర్ అసిస్టెంట్ పోస్టులు: 1
- పోస్ట్ మార్టం అసిస్టెంట్ పోస్టులు: 7
- జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టులు: 3
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.15,000ల నుంచి రూ.52,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి పదో తరగతి, సంబంధిత టెక్నికల్ కోర్సు, బీటెక్ (బయో మెడికల్ ఇంజినీరింగ్)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, అనుభవం, రిజర్వేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు రుసుము:
- ఓసీ అభ్యర్ధులకు: రూ. 500
- ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులకు: రూ. 300
- వింకలాంగ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: డిస్రిక్ట్ కో ఆర్డినేటర్ ఆఫ్ హాస్సిటల్ సర్వీసెస్ (APVVP), ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్.
దరఖాస్తులకు చివరి తేదీ: మే 26, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.