AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో ప్రధాని మోదీ తల్లికి ఆలయం.. ఎక్కడ నిర్మిస్తున్నారు? ప్రత్యేకతలేంటి?

ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీకి కర్నూలు జిల్లాలో ‘మాతా శ్రీ మందిరం’ నిర్మిస్తున్నారు. ఎమ్మిగనూరు మండలం గుడికల్ గ్రామంలో ఆలయ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. ఆలయంతో పాటు శివుడు, దక్షిణామూర్తి, శ్రీరాముడు, వినాయకుడి ఆలయాలను నిర్మించనున్నారు. .. ..

ఏపీలో ప్రధాని మోదీ తల్లికి ఆలయం.. ఎక్కడ నిర్మిస్తున్నారు? ప్రత్యేకతలేంటి?
Hiraben Modi Temple
J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Nov 17, 2026 | 7:00 PM

Share

ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో ఓ ఆలయం నిర్మిస్తున్నారు. కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు మండలం గుడికల్ గ్రామంలో ‘మాతా శ్రీ మందిరం’ నిర్మాణానికి నిర్వాహకులు శ్రీకారం చుట్టారు. అయితే ఈ ఆలయం కేవలం ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా.. అనాథ పిల్లలకు ఆశ్రయం, మూగజీవాలకు రక్షణ కల్పించే కేంద్రంగా కూడా రూపుదిద్దుకోనుంది.

మాతా శ్రీ మందిరం చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ నిర్మాణం చేపడుతున్నారు. సొసైటీ ప్రతినిధులు బాలాజీ, శివకుమార్ నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. ఆలయ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి, వైసీపీ మాజీ రాష్ట్ర వీరశైవ లింగాయత్ చైర్మన్ రుద్రగౌడ్ హాజరయ్యారు.

ఈ ప్రాంగణంలో మాతా శ్రీ మందిరంతో పాటు శివుడు, దక్షిణామూర్తి, శ్రీరాముడు, వినాయకుడి ఆలయాలను కూడా నిర్మించనున్నారు. అంతేకాదు.. అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పించేందుకు శరణాలయం, మూగజీవాల సంరక్షణ కోసం గోశాల ఏర్పాటు చేయాలని నిర్వాహకులు నిర్ణయించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ.. హీరాబెన్ మోదీ పేరుతో ఆలయ నిర్మాణం చేపట్టడం అభినందనీయమన్నారు. ఆధ్యాత్మికతతో పాటు సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వడం గొప్ప విషయమని కొనియాడారు.

మొత్తంగా హీరాబెన్ మోదీ పేరుతో నిర్మిస్తున్న ఈ ఆలయం.. భక్తితో పాటు సేవా కార్యక్రమాలకు కూడా వేదికగా నిలవనుంది.

Temple Spot

Temple Spot

Follow Us