AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

APTWREIS Admissions 2024-25: ఏపీ గిరిజన సంక్షేమ గురుకులాల్లో 8వ తరగతి, ఇంటర్‌ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏడు గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థ (ఎస్‌వోఈ/ సీవీఈ)ల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను 8వ తరగతి, ఇంటర్మీడియట్ ఫస్ట్‌ ఇయర్‌లో ప్రవేశాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (గురుకులం) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. గిరిజన బాలబాలికలకు మాత్రమే ఈ గురుకులాల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఆసక్తి కలిగిన బాలబాలికలు మార్చి 25వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి..

APTWREIS Admissions 2024-25: ఏపీ గిరిజన సంక్షేమ గురుకులాల్లో 8వ తరగతి, ఇంటర్‌ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం
APTWREIS
Srilakshmi C
|

Updated on: Feb 12, 2024 | 4:14 PM

Share

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏడు గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థ (ఎస్‌వోఈ/ సీవీఈ)ల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను 8వ తరగతి, ఇంటర్మీడియట్ ఫస్ట్‌ ఇయర్‌లో ప్రవేశాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (గురుకులం) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. గిరిజన బాలబాలికలకు మాత్రమే ఈ గురుకులాల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఆసక్తి కలిగిన బాలబాలికలు మార్చి 25వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్య, వసతి కల్పిస్తారు. అలాగే జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఇంటర్ ఎంపీలో 300 సీట్లు; ఇంటర్ బైపీసీలో 300 సీట్లు; 8వ తరగతిలో 180 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థలున్న ప్రదేశాలు ఇవే..

  • కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ (పీజీటీ), మల్లి
  • స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, విశాఖపట్నం
  • స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, పార్వతీపురం (జోగింపేట)
  • కాలేజ్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, విస్సన్నపేట
  • స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, శ్రీకాళహస్తి
  • స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, శ్రీశైలం డ్యామ్
  • కాలేజ్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, తనకల్లు

ఎవరు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులంటే..

ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా పాఠశాలో 2023-24 విద్యా సంవత్సరానికి ఏడో తరగతి ఉత్తీర్ణులై విద్యార్థులు 8వ తరగతి ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలు పొందగోరే విద్యార్ధులు తప్పనిసరిగా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2023-24 విద్యా సంవత్సరం పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.లక్షకు మించరాదు. 8వ తరగతి ప్రవేశ పరీక్ష, ఇంటర్‌ ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం..

ఎనిమిదో తరగతి ప్రవేశ పరీక్షను మొత్తం 100 మార్కులకు 100 ప్రశ్నలకు ఉంటుంది. ఏడో తరగతి సిలబస్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు. తెలుగు సబ్జెక్ట్‌ నుంచి 10 మార్కులు, ఇంగ్లిష్‌ సబ్జెక్ట్‌ నుంచి 10 మార్కులు, హిందీ సబ్జెక్ట్‌ నుంచి 10 మార్కులు, మ్యాథ్స్‌ సబ్జెక్ట్‌ నుంచి 20 మార్కులు, ఫిజికల్‌ సైన్స్‌ సబ్జెక్ట్‌ నుంచి 15 మార్కులు, బయోసైన్స్‌ సబ్జెక్ట్‌ నుంచి 15 మార్కులు, సోషల్‌ స్టడీస్‌ సబ్జెక్ట్‌ నుంచి 20 మార్కులు వస్తాయి. ఇంటర్‌ ప్రవేశ పరీక్షకు పదో తరగతి సిలబస్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇంగ్లిష్‌ సబ్జెక్ట్‌ నుంచి 20 మార్కులు, మ్యాథ్స్‌ సబ్జెక్ట్‌ నుంచి 40 మార్కులు, ఫిజికల్‌ సైన్స్‌ సబ్జెక్ట్‌ నుంచి 20 మార్కులు, బయోసైన్స్‌ సబ్జెక్ట్‌ నుంచి 20 మార్కులు సబ్జెక్టు వస్తాయి.

ఇవి కూడా చదవండి

ముఖ్యమైన తేదీల వివరాలు..

  • ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 25, 2024.
  • హాల్ టిక్కెట్‌ డౌన్‌లోడ్ ప్రారంభ తేదీ: మార్చి 30, 2024.
  • ప్రవేశ పరీక్ష తేదీ: ఏప్రిల్‌ 7, 2024.
  • మెరిట్ జాబితా వెల్లడి తేదీ: మే 05, 2024.
  • మొదటి దశ కౌన్సెలింగ్ తేదీ: మే 20, 2024.
  • రెండో దశ కౌన్సెలింగ్ తేదీ: మే 25, 2024.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని వివరాలకు క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
కాలేజీని వీడినా, బంధాన్ని వీడలేదు.. ఓయూకు పూర్వ విద్యార్థి విరాళం
కాలేజీని వీడినా, బంధాన్ని వీడలేదు.. ఓయూకు పూర్వ విద్యార్థి విరాళం
'నా మృతదేహం పక్కన తారక్‌తో సహా ఆ హీరోలందరూ'.. జగ్గూభాయ్ కామెంట్స్
'నా మృతదేహం పక్కన తారక్‌తో సహా ఆ హీరోలందరూ'.. జగ్గూభాయ్ కామెంట్స్
మామిడి పండ్లు తిన్న తర్వాత తీవ్ర అస్వస్థత.. కాసేపటికే దారుణం!
మామిడి పండ్లు తిన్న తర్వాత తీవ్ర అస్వస్థత.. కాసేపటికే దారుణం!
తొలకరి పలకరింపుతో తడిసిన నేల..ఆరుద్రల పరుగులతో మురిసిన పొలం!
తొలకరి పలకరింపుతో తడిసిన నేల..ఆరుద్రల పరుగులతో మురిసిన పొలం!
ఇంట్లో ఈవీ ఛార్జర్‌ను ఏర్పాటు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది?
ఇంట్లో ఈవీ ఛార్జర్‌ను ఏర్పాటు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది?
స్విట్జర్లాండ్ ఫుట్‌బాల్ జట్టు పై పగబట్టిన పాములు
స్విట్జర్లాండ్ ఫుట్‌బాల్ జట్టు పై పగబట్టిన పాములు
వాటర్ పంపుల వద్ద వింత శబ్ధాలు.. భయంతో వణికిన సిబ్బంది
వాటర్ పంపుల వద్ద వింత శబ్ధాలు.. భయంతో వణికిన సిబ్బంది
ప్యాంట్ జేబులో ఉండగా ఒక్కసారిగా పేలిపోయిన ఫోన్.. ఇదిగో వీడియో
ప్యాంట్ జేబులో ఉండగా ఒక్కసారిగా పేలిపోయిన ఫోన్.. ఇదిగో వీడియో
పాపం! జాన్వీని తిట్టొద్దు..ఆమె దర్శకుడు చెప్పిందే చేసింది
పాపం! జాన్వీని తిట్టొద్దు..ఆమె దర్శకుడు చెప్పిందే చేసింది
'పరభాషా నటులతో పోల్చితే అనుకున్నంత గుర్తింపు రావడం లేదు
'పరభాషా నటులతో పోల్చితే అనుకున్నంత గుర్తింపు రావడం లేదు