Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

APSWREIS 5th Class Admissions 2025: డా బీఆర్‌ అంబేడ్కర్ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలు.. పేదింటి బిడ్డలకు ఛాన్స్‌

2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలోని 5వ తరగతి, ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్‌ ప్రవేశాలకు బీఆర్‌ఏజీ సెట్‌-2025 నోటిఫికేషన్‌ను సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ విడుదల చేసింది. పేదింటి విద్యార్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవచ్చు. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి..

APSWREIS 5th Class Admissions 2025: డా బీఆర్‌ అంబేడ్కర్ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలు.. పేదింటి బిడ్డలకు ఛాన్స్‌
APSWREIS 5th Class Admissions
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 14, 2025 | 3:58 PM

ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌).. రాష్ట్రంలోని డా బీఆర్‌ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాలు, డా బీఆర్‌ అంబేడ్కర్‌ ఐఐటీ-మెడికల్‌ అకాడమీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 5వ తరగతి, ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్‌ ప్రవేశాలకు బీఆర్‌ఏజీ సెట్‌-2025 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రస్తుతం 4వ తరగతి చదువుతున్న బాలబాలికలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న విద్యార్ధులు ఇంటర్‌ ఫస్ట్ ఇయర్‌లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

డా.బీఆర్ అంబేడ్కర్ గురుకులం ఐదో తరగతి, ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలకు బీఆర్‌ఏజీ ఎంట్రన్స్ టెస్ట్- 2025కు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా పాఠశాలలో 2023-24 విద్యాసంవత్సరంలో మూడో తరగతి, 2024-25 విద్యా సంవత్సరంలో 4వ తరగతి పూర్తి చేసి ఉండాలి. అలాగే జూనియర్‌ ఇంటర్మీడియట్‌ ప్రవేశాలకు సంబంధిత జిల్లాల్లో 2024-25 విద్యా సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసి ఉండాలి. ప్రస్తుతం పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు చేసుకునే విద్యార్థి వయస్సు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులైతే సెప్టెంబర్ 01, 2012 నుంచి ఆగస్టు 31, 2016 మధ్య జన్మించి ఉండాలి. అలాగే ఓసీ/ బీసీ/ బీసీ సి విద్యార్థులు సెప్టెంబర్‌ 01, 2014 నుంచి ఆగస్టు 31, 2016 మధ్య జన్మించి ఉండాలి. ఇంటర్మీడియట్‌ ప్రవేశాలకైతే విద్యార్థులు ఆగస్టు 31, 2025 నాటికి 17 ఏళ్లు మించకుండా ఉండాలి. విద్యార్ధుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.లక్షకు మించకుండా ఉండాలి. ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థుల ఎంపిక జరుగుతుంది. ఈ ప్రవేశ పరీక్షలో ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్యతోపాటు వసతి సౌకర్యం కూడా కల్పిస్తారు. ఐఐటీ నీట్‌ కోచింగ్‌ సెంటర్లలో ప్రవేశాలకు ఐఐటీ మెడికల్‌ అకాడమీల పరీక్ష కూడా ఉంటుంది. ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా సీటు కేటాయిస్తారు.

ఇవి కూడా చదవండి

రాత పరీక్ష విధానం..

ఐదో తరగతి ప్రవేశాలకు మొత్తం 50 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలకు పరీక్ష ఉంటుంది. గణితంలో 15, ఇంగ్లిష్‌లో 10, తెలుగులో 10, ఈవీఎస్‌లో 15 ప్రశ్నల చొప్పున అడుగుతారు. పరీక్ష వ్యవధి రెండు గంటలు. అలాగే ఇంటర్మీడియట్‌ ప్రశ్నపత్రం కూడా ఆబ్జెక్టివ్‌ విధానంలో 100 ప్రశ్నలకు ఉంటుంది. గణితంలో 15, ఫిజికల్‌ సైన్స్‌లో 15, సైన్స్‌లో 15, సామాకజిక అధ్యయనాలులో 10, ఇంగ్లిష్‌లో 15, లాజికల్‌ రీజనింగ్‌ అండ్‌ ఆప్టిట్యూడ్‌లో 30 ప్రశ్నల చొప్పున అడుగుతారు. రెండున్నర గంటల వ్యవధిలో పరీక్ష ఉంటుంది. రెండు తరగతులకు క్వశ్చన్‌ పేపర్లు ఆంగ్లం, తెలుగు మాధ్యమాల్లో ఇస్తారు.

ముఖ్యమైన తేదీలు…

  • దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 6, 2025.
  • హాల్ టికెట్ డౌన్‌లోడ్‌ తేదీ: ఏప్రిల్ 01, 2025.
  • ఇంటర్మీడియట్‌ ప్రవేశ పరీక్ష తేదీ: ఏప్రిల్ 06, 2025.
  • ఐదో తరగతి ప్రవేశ పరీక్ష తేదీ: ఏప్రిల్ 20, 2025.
  • ఐఐటీ మెడికల్‌ కోచింగ్‌ సెంటర్ల ప్రవేశ పరీక్ష తేదీ: ఏప్రిల్ 20, 2025.

ఏపీ డా బీఆర్‌ అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి, ఇంటర్‌ ప్రవేశాల నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

గబ్బా కూల్చివేత నిర్ణయం.. షాక్ లో క్రికెట్ ప్రపంచం!
గబ్బా కూల్చివేత నిర్ణయం.. షాక్ లో క్రికెట్ ప్రపంచం!
Video: పాక్ ఫీల్డర్లు పూనుకున్నారా ఏంది.. సింపుల్ క్యాచ్‌ మిస్..
Video: పాక్ ఫీల్డర్లు పూనుకున్నారా ఏంది.. సింపుల్ క్యాచ్‌ మిస్..
రజనీని అంతలా ప్రేమించిన స్టార్ హీరోయిన్.. చివరకు నిర్మాతతో
రజనీని అంతలా ప్రేమించిన స్టార్ హీరోయిన్.. చివరకు నిర్మాతతో
తీపిని పంచే చెరుకు రసం ఆరోగ్యమా?.. అనారోగ్యమా? వీరికి విషంతో సమ
తీపిని పంచే చెరుకు రసం ఆరోగ్యమా?.. అనారోగ్యమా? వీరికి విషంతో సమ
Money Astrology: ఉగాది తర్వాత ఆదాయానికి లోటు లేని రాశులివే!
Money Astrology: ఉగాది తర్వాత ఆదాయానికి లోటు లేని రాశులివే!
కేంద్రం సంచలన నిర్ణయం.. 2 నెలల్లో 8 లక్షల సిమ్‌ కార్డులు బ్లాక్
కేంద్రం సంచలన నిర్ణయం.. 2 నెలల్లో 8 లక్షల సిమ్‌ కార్డులు బ్లాక్
అటు వర్షాలు.. ఇటు వడగాల్పులు.. ఏపీలో చిత్రవిచిత్ర వాతావరణం
అటు వర్షాలు.. ఇటు వడగాల్పులు.. ఏపీలో చిత్రవిచిత్ర వాతావరణం
దిగ్గజ దర్శకుడు భారతీరాజా కుమారుడు కన్నుమూత.. ఏమైందంటే?
దిగ్గజ దర్శకుడు భారతీరాజా కుమారుడు కన్నుమూత.. ఏమైందంటే?
ఈ పండ్లు షుగర్ బాధితులకు ప్రాణాంతకం.. అస్సలు తినకూడదు..!
ఈ పండ్లు షుగర్ బాధితులకు ప్రాణాంతకం.. అస్సలు తినకూడదు..!
రూ. 2 కోట్ల ఆఫర్ రిజక్ట్.. ఢిల్లీ జట్టుకు ఊహించని షాక్
రూ. 2 కోట్ల ఆఫర్ రిజక్ట్.. ఢిల్లీ జట్టుకు ఊహించని షాక్