Telangana: పోక్సో కేసులో జీవిత ఖైదు విధిస్తూ తీర్పు.. ఆగ్రహంతో జడ్జిపైకి చెప్పు విసిరిన నిందితుడు!
తప్పొప్పులను నిర్ణయించి శిక అమలు చేసే కోర్టు జడ్జి పట్ల ఓ వ్యక్తి దురుసుగా ప్రవర్తించాడు. పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న సదరు వ్యక్తి విచారణలో నేరం రుజువైంది. దీంతో జిల్లా కోర్టు అతడికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చింది. అయితే తీర్పును జీర్ణించుకోలేకపోయిన నిందితుడు ఆవేశంతో జడ్జిపైనే దాడి చేశాడు..

రంగారెడ్డి, ఫిబ్రవరి 13: ఓ కేసులో నిందితుడిగా నిర్ధారనైన వ్యక్తికి కోర్టు తీర్పు వెలువరించింది. జీవిత ఖైదు విధిస్తూ తుది తీర్పు ఇచ్చింది. అయితే తాను నిర్ధోషినని, జడ్జితో మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని నిందితుడు కోర్టులో హల్‌చల్ చేశాడు. ఈ క్రమంలో జడ్జి వద్దకు పరిగెత్తకుంటూ వెళ్లిన నిందితుడు.. ఏకంగా జడ్జిపైకే చెప్పు విసిరాడు. ఈ షాకింగ్ ఘటన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కోర్టులో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..
రంగారెడ్డి జిల్లా కోర్టులో ఎస్సీ, ఎస్టీ కోర్టులో పోక్సో కేసులో నేరస్తుడికి జడ్జి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించారు. దీంతో ఆగ్రహానికి గురైన నేరస్తుడు న్యాయమూర్తి పట్ల దురుసుగా ప్రవర్తించాడు. రంగారెడ్డి ఫోక్స్ కోర్టు న్యాయమూర్తిపై ఏకంగా ముద్దాయి చెప్పు విసిరాడు. తీర్పు అనంతరం తన బాధ జడ్జితో చెప్పుకోవాలంటూ జడ్జి వద్దకు పరుగు తీశాడు. అనంతరం తన కాలి చెప్పు తీసి జడ్జిపైకి విసిరాడు.
ఫోక్సో కేసులో ముద్దాయిగా ప్రకటించడంతో జిర్ణించుకోలేకపోయిన నిందితుడు న్యాయమూర్తిపై దాడికి యత్నించాడు. ఈ క్రమంలో జడ్జిపైకే చెప్పు విసిరాడు. దీంతో రంగారెడ్డి జిల్లా కోర్టులో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనతో షాకైన కోర్టులో ఉన్న న్యాయవాదులు నేరస్తుడిని పట్టుకుని చితకబాది, అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.