AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dalai Lama: టిబెట్‌ మత పెద్ద దలైలామాకు Z కేటగిరీ భద్రత.. కేంద్రం ప్రకటన

టిబెటన్ బౌద్ధమత ఆధ్యాత్మిక గురువు దలైలామాకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ Z-కేటగిరీ భద్రతను మంజూరు చేసింది. ఆయనపై బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అధికారులు తెలిపారు. 89 ఏళ్ల గురువు దలైలామా బాధ్యతలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)లోని VIP భద్రతా విభాగానికి అప్పగించింది.

Dalai Lama: టిబెట్‌ మత పెద్ద దలైలామాకు Z కేటగిరీ భద్రత.. కేంద్రం ప్రకటన
Dalai Lama
Srilakshmi C
|

Updated on: Feb 13, 2025 | 8:27 PM

Share

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: చైనా నిఘా వర్గాల బెదిరింపుల నేపథ్యలో టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామాకు కేంద్ర హోం మంత్రిత్వ గురువారం శాఖ Z-కేటగిరీ భద్రతను కల్పించింది. ఈ మేరకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) కమాండోలు భద్రతను కల్పిస్తారు. దలైలామా (89) రక్షణ బాధ్యత 33 మంది CRPF, VIP భద్రతా విభాగానికి అప్పగించింది. దలైలామాకు Z-కేటగిరీ భద్రత కింద హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలోని ఆయన నివాసంలో సాయుధ స్టాటిక్ గార్డులు, 24 గంటలూ రక్షణ కల్పించే వ్యక్తిగత భద్రతా అధికారులు, షిఫ్ట్‌లలో సాయుధ ఎస్కార్ట్‌ను ఏర్పాటు చేసే కమాండోలను ఏర్పాట్లు చేశారు. దేశవ్యాప్తంగా దలైలామాకు సీఆర్పీఎఫ్ కమాండోలు భద్రత కల్పిస్తారు. వీరితోపాటు శిక్షణ పొందిన డ్రైవర్లు, నిఘా సిబ్బంది అతని భద్రతను నిర్ధారించడానికి అన్ని సమయాల్లో విధుల్లో ఉంటారు.

టిబెట్- చైనా పాలన నుంచి విముక్తి పొందిన తర్వాత టిబెటన్ బౌద్ధమత ఆధ్యాత్మిక గురువు దలైలామా 1959 నుంచి భారతదేశంలోనే నివసిస్తున్నారు. టిబెట్ చుట్టూ ఉన్న సున్నితమైన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల దృష్ట్యా, భారత ప్రభుత్వం అతనికి ఉన్నత స్థాయి భద్రతా కవచాన్ని అందిస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా, చైనా మద్దతుగల సంస్థలతో సహా వివిధ సంస్థల నుంచి దలైలామా ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని నిఘా నివేదికలు సూచించాయి. దీనితో భారత అధికారులు ఆయన రక్షణకు ఏర్పాట్లు చేశారు. జూలైలో 90 ఏళ్లు నిండనున్న దలైలామా చైనా పాలనకు వ్యతిరేకంగా చేసిన తిరుగుబాటు తర్వాత టిబెట్ నుంచి పారిపోయి భారత్‌లోనే ఉంటున్నారు. 2011లో దలైలామా ప్రవాసంలో ఉన్న టిబెటన్ ప్రభుత్వ రాజకీయాల నుంచి వైదొలిగారు.

దలైలామాతోపాటు మణిపూర్‌లోని బీజేపీ నాయకుడు సంబిత్ పాత్రాకు కూడా హోం మంత్రిత్వ శాఖ Z-కేటగిరీ భద్రతను కూడా మంజూరు చేసిందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. దాదాపు 2 సంవత్సరాలుగా మణిపూర్‌లో జరుగుతున్న మత హింస నేపథ్యంలో సంబిత్ పాత్రాకు ఈ రక్షణ లభించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.