President’s Rule: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన..
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.. మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.. అంతకుముందు ఫిబ్రవరి 9న రాష్ట్ర ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే.. కేంద్ర ప్రభుత్వం మణిపూర్ లో రాష్ట్రపతి పాలన విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.. మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.. అంతకుముందు ఫిబ్రవరి 9న రాష్ట్ర ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే.. కేంద్ర ప్రభుత్వం మణిపూర్ లో రాష్ట్రపతి పాలన విధిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.. మణిపూర్ రాష్ట్రంలో దాదాపు రెండు సంవత్సరాలుగా హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి..
మైతీ, కుకీ తెగల మధ్య మొదలైన ఘర్షణతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ అట్టుడుకుతోంది. ఇప్పటికీ.. రావణ కాష్టంలా రగులుతూనే ఉంది. ఈ క్రమంలోనే.. బిరేన్ సింగ్ ఇటీవల రాజీనామా చేశారు. ఈ విషయంతో పాటు ఇతర అంశాలకు సంబంధించి కూడా ఆయనపై విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే బిరేన్ సింగ్ రాజీనామా చేయడం.. ఆ తర్వాత.. రాష్ట్రపతి పాలన విధించనున్నట్లు చర్చ జరిగింది. అనుకున్నట్లుగానే కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 174(1) ప్రకారం రాష్ట్ర అసెంబ్లీలు చివరిసారిగా సమావేశమైన ఆరు నెలల్లోపు సమావేశమవ్వాలి. మణిపూర్‌లో చివరి అసెంబ్లీ సమావేశం ఆగస్టు 12, 2024న జరిగింది.. దీనితో బుధవారం తదుపరి సమావేశానికి గడువు విధించారు. అయితే, ఆదివారం ముఖ్యమంత్రి ఎన్ బిరెన్ సింగ్ రాజీనామా చేయడంతో, సోమవారం ప్రారంభం కావాల్సిన బడ్జెట్ సమావేశాన్ని గవర్నర్ అజయ్ భల్లా రద్దు చేశారు. సీఎం రాజీనామా తర్వాత.. రాష్ట్రంలో ఏ పార్టీ లేదా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు రాలేదు..
ఫిబ్రవరి 10 నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావాల్సి ఉండగా..
మణిపూర్ అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి 10 నుండి ప్రారంభం కావాల్సి ఉంది. ఈ అసెంబ్లీ సమావేశంలో బిరేన్ సింగ్‌పై అవిశ్వాస తీర్మానం తీసుకురావడానికి కాంగ్రెస్ సిద్ధమవుతున్న సమయంలో.. బీరెన్‌సింగ్‌పై సొంత ఎమ్మెల్యేలే తిరుగుబాటు చేశారు. పరిస్థితి చేజారిపోవడంతో తన పదవికి రాజీనామా చేశారు బీరెన్‌సింగ్..
రాష్ట్రపతి పాలన విధించడం వల్ల కలిగే ప్రభావం..
ఏదైనా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించినప్పుడు, ఆ రాష్ట్ర పాలనలో అనేక మార్పులు జరుగుతాయి. రాష్ట్ర పరిపాలన రాష్ట్రపతి నియంత్రణలోకి వస్తుంది. రాష్ట్రపతి తన ప్రతినిధిగా, పరిపాలనను నడిపించే బాధ్యతను గవర్నర్‌కు అప్పగిస్తారు..
రాష్ట్ర చట్టాలపై దాని ప్రభావం ఏమిటి?..
సాధారణంగా రాష్ట్ర అసెంబ్లీలు చట్టాలు చేస్తాయి. కానీ, రాష్ట్రపతి పాలన సమయంలో, పార్లమెంటు రాష్ట్ర చట్టాలను రూపొందిస్తుంది. సమావేశాలు జరగకపోతే రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేయవచ్చు. రాష్ట్రపతి పాలన గరిష్టంగా 6 నెలల పాటు విధించబడుతుంది. కానీ, దీనిని 3 సంవత్సరాల వరకు కూడా పొడిగించవచ్చు. దీనికి పార్లమెంటు అనుమతి అవసరం.
ఏ పరిస్థితులలో రాష్ట్రపతి పాలన విధిస్తారు..
ఏ రాష్ట్రంలోనైనా రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ నిబంధనలను పాటించలేనప్పుడు రాష్ట్రపతి పాలన విధిస్తారు.. శాంతిభద్రతలు విఫలమైతే ఆ రాష్ట్రంలో కూడా రాష్ట్రపతి పాలన విధిస్తారు.. అంతేకాకుండా, ప్రభుత్వం మైనారిటీలోకి వచ్చి స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేయలేనప్పుడు రాష్ట్రపతి పాలన విధిస్తారు. ఇది కాకుండా, అవినీతి, తిరుగుబాటు, విపత్తు లేదా ఇతర కారణాల వల్ల ప్రభుత్వం విఫలమైతే రాష్ట్రపతి పాలన విధిస్తారు.
అయితే.. రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందని వస్తున్న వార్తల మధ్య, గవర్నర్ అజయ్ కుమార్ భల్లా గురువారం సీనియర్ భద్రతా అధికారులతో కీలకమైన సమావేశాన్ని ఏర్పాటు చేశారు.. రాష్ట్రపతి పాలన అనంతరం తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై చర్చలు జరిపారు.




